సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

  • October 29, 2022 / 06:32 PM IST

సరోగసి.. గతకొద్ది రోజులుగా ఈ అంశం గురించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ జూన్‌లో పెళ్లి చేసుకుని, అక్టోబర్‌‌లో కవలలు పుట్టారని ప్రకటించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సరోగసి ద్వారా నయన్‌కి పిల్లలు కలిగారు. ఇది చట్టవ్యతిరేకమని వారిపై కేసు వేయగా.. తమకు ఆరేళ్ల క్రితమే వివాహమైందని ఆధారాలు చూపించడంతో.. రెండేళ్ల క్రితం అమల్లోకి వచ్చిన ఈ చట్టం వారికి వర్తించదు అంటూ కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది. మరోవైపు స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫస్ట్ పాన్ఇండియా ఫిలిం ‘యశోద’ కూడా సరోగసి నేపథ్యంలో తెరకెక్కుతుండడంతో దీని గురించిన న్యూస్ వైరల్ అవుతోంది. మనకు తెలిసి ఇప్పటివరకు సరోగసి నేపథ్యంతో తెలుగులో వచ్చిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1) 9 నెలలు

చియాన్ విక్రమ్ ఫప్ట్ టైం తెలుగులో నటించిన సినిమా ఇది. సౌందర్య కథానాయిక.. అనాథ అయిన సావిత్రి (సౌందర్య) ని.. ఒక తాగుబోతు పెళ్లి చేసుకుంటుండగా ఆపి.. సురేంద్ర (విక్రమ్) వివాహం చేసుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత అతనికి యాక్సిడెంట్ అవుతుంది.. ఆపరేషన్‌కి కావలసిన డబ్బుకోసం సావిత్రి ఎతం ప్రయత్నించినా ఆర్థిక సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు. ఒక ధనవంతుడి కోసం కృత్రిమ గర్భధారణ ద్వారా గర్భవతి కావాలని, అందుకు తగిన ఆర్థిక సహాయం చేస్తారని లేడీ డాక్టర్ చెప్పగా, సావిత్రి అంగీకరిస్తుంది. కృత్రిమ గర్భధారణ, సర్రోగేట్ మాతృత్వానికి సంబంధించిన సామాజిక కళంకమనే ఆధారంగా ఈ ‘9 నెలలు’ చిత్రం రూపొందించబడింది..

2) వెల్‌కమ్ ఒబామా: 

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు.. సరోగసి నేపథ్యంతో తెరకెక్కించిన ఎమోషనల్ డ్రామా ‘వెల్‌కమ్ ఒబామా’.. లూసీ అనే విదేశీయురాలికి అద్దె గర్భం (సరోగసి) ద్వారా తన బిడ్డకు జన్మనిచ్చే ఓ అద్దె తల్లి అవసరం అవుతుంది. దాంతో మనదేశం లోని కొందరు దళారుల్ని ఆశ్రయిస్తుంది. వారి ద్వారానే యశోద గురించి తెలుసుకుంటుంది. తన పెంపుడు కూతురు ఆపరేషన్ నిమిత్తం యశోదకు అర్జంట్‌గా లక్ష రూపాయిలు కావాలి. దాంతో తన గర్భం ద్వారా లూసీ బిడ్డకు జన్మనీయడానికి యశోద అంగీకరిస్తుంది. అన్నీ సక్రమంగా జరుగుతాయి. లూసీ దంపతుల బిడ్డ యశోద కడుపులో పడుతుంది. నెలలు నిండుతాయి. యశోదను వైద్య పరీక్షలకి తీసుకెళుతుంది లూసీ. యశోద కడుపులోని బిడ్డ వైకల్యంతో పుట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో షాక్‌కు గురవుతుంది.

అలాంటి బిడ్డ తనకొద్దంటుంది. ప్రసవానంతరం బిడ్డను ఆనాథ శరణాలయంలో పడేయమని యశోదకు డబ్బు కూడా ఇవ్వబోతుంది. కానీ యశోద మాత్రం ఒప్పుకోదు. అందరూ ఉన్న తన బిడ్డ అనాథ ఎలా అవుతాడని లూసీని నిలదీస్తుంది. కానీ లూసీ మాత్రం ఆ బిడ్డ తనకొద్దంటూ అక్కడినుండి వెళ్లిపోతుంది. తీరా యశోదకు ఎలాంటి లోపం లేని చక్కని మగబిడ్డ పుడతాడు. ఆ తెల్లజాతి బిడ్డకు ‘కృష్ణ’ అని పేరు పెట్టుకొని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది యశోద. కొన్నేళ్లు గడుస్తాయి. ఓ రోజు లూసీ మళ్లీ యశోద ముందు ప్రత్యక్షమవుతుంది. తన బిడ్డను తనకిచ్చేయమంటుంది. యశోద గుండె బద్దలైనంత పనవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనే ఆసక్తికర అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది.

3) స్వాతిముత్యం: 

బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ నటించిన ‘స్వాతిముత్యం’ ఈ దసరాకి విడుదలైంది. పెద్దలు కుదిర్చిన సంబంధం ద్వారానే ప్రేమలో పడడం.. పెళ్లి పీటలెక్కబోతుండగా.. మరో మహిళ వచ్చి నీ బిడ్డని నీ దగ్గరే ఉంచుకో అని హీరోకివ్వడంతో కథ కీలకమలుపు తిరుగుతుంది. అసలు సరోగసికి ఒప్పుకున్న మహిళకి, హీరోకీ సంబంధం ఏంటి.. చివరికి ఆ బిడ్డ ఏమయ్యాడు.. హీరో పెళ్లి సంగతి ఏమైందనే విషయాలను ఆసక్తికరంగా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ.

4) యశోద: 

సమంత ప్రధాన పాత్రలో సరోగసి నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘యశోద’ తెరకెక్కినట్లు ట్రైలర్‌తో రివీల్ చేశారు. సామ్, సరోగసి మదర్‌గా ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో కనిపించనుంది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు చేయకూడని రిస్క్‌తో కూడుకున్న పనులను తను ఎందుకు చెయ్యాల్సి వచ్చిందనేది ఆసక్తికరంగా అనిపిస్తోంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో రూపొందిన ‘యశోద’ ప్రేక్షకులను థ్రిల్ కలిగిస్తుందని హింట్ ఇచ్చారు. ట్రైలర్ చివర్లో ‘‘యశోద ఎవరో తెలుసు కదా.. ఆ కృష్ణ పరమాత్ముణ్ణి పెంచిన తల్లి’’ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. సరోగసీ ద్వారా పిల్లలు కలిగిన పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లను కూడా ట్రైలర్‌లో ప్రస్తావించారు. బాలీవుడ్‌లోనూ సరోగసి బ్యాక్‌డ్రాప్‌లో పలు సినిమాలు వచ్చాయి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus