బ్లాక్ బస్టర్ దర్శకుడిగా మారి 8 ఏళ్ళు.. అనిల్ రావిపూడి రైటర్ గా చేసిన సినిమాల లిస్ట్..!

  • January 24, 2023 / 07:14 PM IST

అనిల్ రావిపూడి.. 2015 లో వచ్చిన ‘పటాస్’ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుని మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. ఆ తర్వాత ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్2’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘ఎఫ్3’ వంటి చిత్రాలతో హిట్లు అందుకుని సక్సెస్ ఫుల్ దర్శకుడిగా మారిపోయాడు. ఫెయిల్యూర్ అంటూ లేని దర్శకుల్లో రాజమౌళి తర్వాత ఆ స్థానంలో నిలిచాడు అనిల్ రావిపూడి. తాను ఏ సినిమా తీసినా నిర్మాతను, బయ్యర్స్ ను దృష్టిలో పెట్టుకుని.. బడ్జెట్ శృతి మించకుండా జాగ్రత్త పడతాడు అనిల్ రావిపూడి. ఇతని సక్సెస్ కు ఫార్ములా కూడా అదే అంటుంటాడు. ప్రస్తుతం బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు అనిల్ రావిపూడి గురించి ఈ డిస్కషన్ ఎందుకు అంటే.. అతను తెరకెక్కించిన ‘పటాస్’ మూవీ జనవరి 23న అంటే 2015 లోనే రిలీజ్ అయ్యింది. అంటే డైరెక్టర్ గా మారి 8 ఏళ్ళు అయ్యిందన్న మాట.

ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను మొదట రైటర్ గా పలు సినిమాలకు పనిచేశాడు. ‘తమ్ముడు’ చిత్రం డైరెక్టర్ పి.ఏ.అరుణ్ ప్రసాద్… అనిల్ రావిపూడికి బాబాయ్ అవుతాడు. అతని సాయంతోనే అనిల్ రావిపూడి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. సరే ఇదంతా పక్కన పెట్టి.. రైటర్ గా అనిల్ రావిపూడి చేసిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) శౌర్యం :

గోపీచంద్ హీరోగా ‘సిరుతై’ శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి అనఫీషియల్ రైటర్ గా పనిచేశాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

2) శంఖం :

గోపీచంద్ హీరోగా ‘సిరుతై’ శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి డైలాగ్ రైటర్ గా పనిచేశాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

3) కందిరీగ :

రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేశాడు.

4) దరువు :

రవితేజ హీరోగా ‘సిరుతై’ శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి డైలాగ్ రైటర్ గా పనిచేశాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

5) మసాలా :

వెంకటేష్ – రామ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మల్టీస్టారర్ కు విజయ్ భాస్కర్ దర్శకుడు కాగా అనిల్ రావిపూడి డైలాగ్ రైటర్ గా పనిచేశాడు. ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

6) హ్యాపీ హ్యాపీగా :

వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ మూవీకి ప్రియా శరన్ డైరెక్టర్ కాగా అనిల్ రావిపూడి డైలాగ్ రైటర్ గా పనిచేశాడు.

7) పవర్ :

రవితేజ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కూడా అనిల్ రావిపూడి ఓ రైటర్ గా పనిచేశాడు. సినిమా సక్సెస్ అందుకుంది.

8) ఆగడు :

మహేష్ – శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేశాడు అనిల్ రావిపూడి. అయితే ఫస్ట్ హాఫ్ వరకు మాత్రమే..! సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది.

9) పండగ చేస్కో :

రామ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేశాడు. ఈ సినిమా సక్సెస్ అందుకుంది.

10) గాలి సంపత్ :

శ్రీవిష్ణు హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేశాడు. ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus