సంక్రాంతి సీజన్ అంటేనే కొత్త సినిమాలకు పెట్టింది పేరు. రాబోయే 2026 పొంగల్ రేస్ లో పోటీ పడటానికి అరడజన్ కు పైగా హీరోలు సిద్దమవుతున్నారు. ఇందులో ఆ టైం కి ఎంత మంది పోటీలో వుంటారో చూడాలి. అయితే మొత్తంగా 7 సినిమాలు అదృష్టం పరీక్షించుకోనున్నాయి. వాటిలో 4 డైరెక్ట్ తెలుగు సినిమాలు అవ్వగా , మిగతావి తమిళ్ డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి.
ప్రభాస్ : రాజాసాబ్
అయితే ఇందులో ముందుగా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా , నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ , జరీనా వాహబ్ హీరోయిన్లుగా, సంజయ్ దత్ ప్రధాన పాత్రలో, మారుతి దర్శకత్వం వహిస్తున్న “రాజాసాబ్ “ను టి.జి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈచిత్రం జనవరి 9న విడుదలకు సిద్ధం అయ్యి , సంక్రాంతి బరిలో దిగనుంది. ఇదే రోజున ఇళయ దలపతి విజయ్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ” జన నాయగన్ ” కూడా జనవరి 9న రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా బాలయ్య నటించిన “భగవంత్ కేసరి”మూవీ కి రీమేక్. కాబట్టి ఈ మూవీ కి తెలుగులో పెద్దగా బజ్ ఉండకపోవచ్చు.
చిరంజీవి : మన శంకర వరప్రసాద్ గారు
పొంగల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న మరో మూవీ “మన శంకర వరప్రసాద్ గారు”. సెకండ్ ఇన్నింగ్స్ తరువాత మెగాస్టార్ చిరంజీవి కి బాగా కలిసొచ్చిన సీజన్ సంక్రాంతి అనే చెప్పాలి. ఎందుకు అంటే ఖైదీ నెం.150, వాల్తేరు వీరయ్య ఈ రెండు సినిమాలు కూడా పొంగల్ బరిలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. మరోసారి మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” మూవీ ద్వారా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సంక్రాంతికి ఓటమి ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి , ఈ కాంబినేషన్ లో రానున్న ఈ మెగా మూవీ లో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన మీసాల పిల్ల సింగల్ కూడా ట్రేండింగ్ లో ఉంది. అభిమానుల్లో కూడా ఈ మూవీ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.
నారి నారి నడుమ మురారి & అనగనగా ఒక రాజు :
శర్వానంద్ హీరోగా , సాక్షి వైద్య & సంయుక్త మీనన్ హీరోయిన్లుగా , రామ్ అబ్బరాజ్ డైరెక్షన్ లో రూపొందుతున్న ” నారి నారి నడుమ మురారి ” మరియు నవీన్ పోలిశెట్టి హీరో గా , మీనాక్షి చౌదరి హీరోయిన్ గా , మారి దర్శకత్వంలో ” అనగనగా ఒక రాజు ” కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. స్టార్ హీరోలు ఆల్రెడీ కర్చీఫ్ వేసి వున్నా కూడా కంటెంట్ మీద నమ్మకం & పండుగ సీజన్ కావటంతో వీళ్లు కూడా బరిలో నిలవాలని చూస్తున్నారు.
శివ కార్తికేయన్ : పరాశక్తి
శివ కార్తికేయన్ నటంచిన ” పరాశక్తి ” రేస్ లో ఉన్నా కూడా ఇంత కంపిటిషన్ లో థియేటర్లు దొరకడం చాలా కష్టం.
రవితేజ కిశోర్ కొత్త సినిమా
కిశోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న రవితేజ కొత్త సినిమా సంక్రాంతికి వస్తున్నాం అని అంటున్నారు కానీ నవంబర్ చివరి వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యేలా లేదు సో ఈ సినిమా పొంగల్ బరిలో నిలుస్తుంది అనేది కొంచం కష్టమే అని చెప్పాలి.
స్టార్ హీరోలతో పాటు నవీన్ పోలిశెట్టి “అనగనగా ఒక రాజు” మూవీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పొంగల్ బరిలో ఉంటుందని సినీ వర్గాల నుంచి వినపడుతున్న సమాచారం.