ఇప్పటి వరకూ భారీ నష్టాలను మిగిల్చిన సినిమాల లిస్ట్..!

ఓ సినిమాకు జరిగిన థియేట్రికల్ బిజినెస్ కు మ్యాచ్ అయ్యే కలెక్షన్స్(షేర్ రూపంలో) వచ్చాయా లేదా అన్న పాయింట్ పైనే..ఆ సినిమా హిట్టా? ప్లాపా? అన్నది డిసైడ్ చేస్తుంటారు ట్రేడ్ పండితులు. పెద్ద హీరో సినిమా అయినప్పటికీ పాజిటివ్ టాక్ రాలేదు అంటే మాత్రం.. అది ఎంత భారీ బడ్జెట్ చిత్రమైనా ప్రేక్షకులు పట్టించుకోరు అన్నది వాస్తవం. అలా చాలా సినిమాలు ప్లాప్ టాక్ రావడంతో థియేట్రికల్ బిజినెస్ కు తగిన కలెక్షన్లను రాబట్టలేక డిజాస్టర్లుగా మిగిలాయి. ఇప్పటి వరకూ భారీ నష్టాలను మిగిల్చిన టాలీవుడ్ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) అజ్ఞాతవాసి :

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 67.1 కోట్ల భారీ నష్టాల్ని మిగిల్చింది.

2) స్పైడర్ :

మహేష్ – మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 61 కోట్ల భారీ నష్టాల్ని మిగిల్చింది.

3) సైరా నరసింహారెడ్డి :

చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రూపొందిన ఈ చారిత్రాత్మక చిత్రం.. హిట్ టాక్ సంపాదించుకున్నప్పటికీ 60 కోట్ల భారీ నష్టాలను మిగిల్చింది.

4) సాహో :

‘బాహుబలి’ తరువాత ప్రభాస్ హీరోగా సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం 52.15 కోట్ల భారీ నష్టాల్ని మిగిల్చింది.

5) ఎన్టీఆర్ కథానాయకుడు :

ఎన్టీఆర్ సినీ జీవిత చరిత్రతో బాలకృష్ణ హీరోగా క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం 50.27 కోట్ల భారీ నష్టాల్ని మిగిల్చింది.

6) ఎన్టీఆర్ మహానాయకుడు :

ఎన్టీఆర్ రాజకీయ జీవిత చరిత్రతో బాలకృష్ణ హీరోగా క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం 47.22 కోట్ల భారీ నష్టాల్ని మిగిల్చింది. చెప్పాలంటే ఈ చిత్రానికి బిజినెస్ ఏమీ జరగలేదు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ కి వచ్చిన నష్టాలకు పరిహారంగా ఈ చిత్రాన్ని అదే డిస్ట్రిబ్యూటర్లకు అప్పగించారు. అయినా ఈ చిత్రం సగం నష్టాలను కూడా కవర్ చెయ్యలేకపోయింది.

7) 1 నేనొక్కడినే :

మహేష్ బాబు – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 42.7 కోట్ల భారీ నష్టాల్ని మిగిల్చింది.

8) బ్రహ్మోత్సవం :

మహేష్ బాబు – శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 38.8 కోట్ల భారీ నష్టాల్ని మిగిల్చింది.

9) సర్ధార్ గబ్బర్ సింగ్ :

పవన్ కళ్యాణ్- బాబీ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 37 కోట్ల భారీ నష్టాల్ని మిగిల్చింది.

10) అఖిల్ :

అఖిల్- వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 28.3 కోట్ల భారీ నష్టాల్ని మిగిల్చింది.

11) కొమరం పులి :

పవన్ కళ్యాణ్ – ఎస్.జె.సూర్య కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 26.7 కోట్ల భారీ నష్టాల్ని మిగిల్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus