‘మాస్టర్’ టు ‘ఘోస్ట్’.. ఓటీటీల్లో మాత్రం హిట్ అనిపించుకున్న సినిమాల లిస్ట్..!

ఓ సినిమా హిట్ అని చెప్పడానికి థియేట్రికల్ రన్ సరిపోతుంది అని అంతా అనుకుంటారు.కానీ కాదు. థియేట్రికల్ రైట్స్ తో పాటు డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ కు కూడా భారీగా బిజినెస్ జరుగుతుంది. కాబట్టి.. ఓటీటీ, స్మాల్ స్క్రీన్ ల పై కూడా సినిమా సత్తా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పాలి. థియేటర్లో సక్సెస్ అయినంత మాత్రాన డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ రూపంలో సినిమా సక్సెస్ అవుతుంది అని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కొన్ని పైరసీ సైట్స్ లో సినిమా హై క్వాలిటీ వెర్షన్ తో అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా సినిమాని మొబైల్స్ లో ఎన్నిసార్లయినా చూసే జనాలు చాలా మంది ఉన్నారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేద్దాం.. కొన్ని సినిమాలు థియేటర్లలో హిట్ అయినా ఓటీటీల్లోకి వచ్చాక ‘ఇదేం సినిమా రా బాబు. ఇదెలా హిట్ అయ్యింది రా’ అంటూ నెత్తి కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం థియేటర్లలో సక్సెస్ కాకపోయినా ఓటీటీల్లో సూపర్ సక్సెస్ అందుకున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఎ1 ఎక్స్ ప్రెస్ :

సందీప్ కిషన్ హీరోగా డెన్నిస్ జీవన్ కోలుకోలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది రిలీజ్ అయ్యింది. సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు కానీ ఓటిటీలో మాత్రం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. సన్ నెక్స్ట్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

2)ప్లే బ్యాక్ :

అనన్య నాగళ్ళ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ.. థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఓటీటీలో జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ మూవీ ‘ఆహా’ లో అందుబాటులో ఉంది.

3) శ్రీకారం :

శర్వానంద్ హీరోగా కిషోర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మావోయి కూడా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. సన్ నెక్స్ట్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.




4) రంగ్ దే :

నితిన్- కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ మూవీకి వెంకీ కుడుముల దర్శకుడు. థియేటర్లలో ఈ మూవీ అంతంత మాత్రమే ఆడింది. కానీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. జీ5 లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

5) వైల్డ్ డాగ్ :

నాగార్జున హీరోగా ఆశిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో ప్లాప్ కానీ ఓటీటీలో సూపర్ హిట్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.




6) పాగల్ :

విశ్వక్ సేన్ నటించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అతని ఓవర్ షోయింగ్ కు సరిగ్గా ఆడలేదు అని చాలా మంది అంటుంటారు. కానీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది.

7) అంటే సుందరానికి :

నాని- నజ్రియా కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ కూడా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.




8) విరాటపర్వం :

రానా- సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ కూడా థియేటర్లలో డిజాస్టర్. కానీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

9) అశోక వనంలో అర్జున కళ్యాణం :

విశ్వక్ సేన్ నటించిన ఈ మూవీ థియేటర్లలో అంతంత మాత్రమే ఆడింది. కానీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఆహాలో ఈ మూవీ అందుబాటులో ఉంది.




10) ది ఘోస్ట్ :

నాగార్జున నటించిన ఈ మూవీ థియేటర్లలోకి వచ్చి వెళ్లినట్టు కూడా జనాలు పట్టించుకోలేదు. కానీ నెట్ ఫ్లిక్స్ లో మాత్రం ఈ మూవీ సూపర్ సక్సెస్ ను అందుకుంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus