‘వాల్తేరు వీరయ్య’ తో పాటు నైజాంలో రూ.25 కోట్ల పైగా షేర్ ని కలెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

తెలుగు సినిమా మార్కెట్ రోజు రోజుకి పెరుగుతుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానీ తెలుగు సినిమాలకు కూడా ఓవర్సీస్ లో మిలియన్ల కొద్దీ డాలర్ల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని సినిమాలు ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేశాయి.. చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు అనగానే అందరికీ టక్కున నైజాం ఏరియా గుర్తుకొస్తుంది. ఆంధ్ర నుండి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. అందరికీ కామన్ గా ఇష్టం ఉండేది సినిమా అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకే నైజాం ఏరియాలో పెద్ద హీరోల సినిమాలకు భారీ కలెక్షన్లు నమోదవుతూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ మార్కెట్ ఉంది అంటే ఆ హీరో స్టార్ గా ఎదిగినట్టే..! నైజాంలో ఎక్కువ కలెక్షన్లు నమోదయ్యేది కూడా స్టార్ హీరోలకే. సరే ఇప్పుడు మనం.. నైజాం ఏరియాలో అత్యధికంగా రూ.25 కోట్లు పైగా వసూళ్లు.. గ్రాస్ కాదు షార్ ను రాబట్టిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఆర్.ఆర్.ఆర్ :

రాజమౌళి – ఎన్టీఆర్ – రాంచరణ్ కాంబినేషన్లో రూపొందిన ఈ భారీ బడ్జెట్ మూవీ ఒక్క నైజాంలోనే రూ.112.13 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది. ఈ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అవ్వడం చాలా కష్టమనే చెప్పాలి.

2) బాహుబలి 2 :

రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్లో రూపొందిన ఈ భారీ బడ్జెట్ మూవీ ఒక్క నైజాంలోనే రూ.66.90 కోట్ల షేర్ ను రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది.’ఆర్.ఆర్.ఆర్’ రాకముందు వరకు ఈ సినిమాదే రికార్డు

3) అల వైకుంఠపురములో :

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఒక్క నైజాంలోనే రూ.44.88 కోట్లు షేర్ ను రాబట్టింది.

4) కె.జి.ఎఫ్ చాప్టర్ 2 :

యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ఈ డబ్బింగ్ సినిమా ఒక్క నైజాంలోనే రూ.43.43 కోట్లు షేర్ ను కొల్లగొట్టింది. డబ్బింగ్ సినిమాల్లో ఈ రేంజ్ కలెక్షన్లు సాధించిన మూవీ మరొకటి లేదు.

5) బాహుబలి ది బిగినింగ్ :

రాజమౌళి- ప్రభాస్- రానా కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ ఒక్క నైజాంలోనే రూ:43.37 కోట్లు కొల్లగొట్టి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.

6) సరిలేరు నీకెవ్వరు :

మహేష్ బాబు- అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ ఒక్క నైజాంలోనే రూ.39.97 కోట్లు షేర్ ను కొల్లగొట్టింది.

7) పుష్ప ది రైజ్ :

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ ఒక్క నైజాంలోనే రూ.37.10 కోట్లు షేర్ ని కలెక్ట్ చేసింది.

8) సర్కారు వారి పాట :

మహేష్ బాబు హీరోగా పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఒక్క నైజాంలోనే రూ.35.02 కోట్లు షేర్ ను రాబట్టింది.

9) సైరా :

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఒక్క నైజాంలోనే రూ.32.20 కోట్లు షేర్ ని కలెక్ట్ చేసి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.

10) భీమ్లా నాయక్ :

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ మూవీ ఒక్క నైజాంలోనే రూ.31.39 కోట్లు షేర్ ని కలెక్ట్ చేసింది.

11) మహర్షి :

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఒక్క నైజాంలోనే రూ.29.90 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసి ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది.

12) సాహో :

ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఒక్క నిజాంలోనే రూ.29.52 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది.

13) రంగస్థలం :

రాంచరణ్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ ఒక్క నైజాంలోనే రూ.27.60 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసి ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది.

14) వాల్తేరు వీరయ్య :

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఒక్క నైజాంలోనే.. అదీ మొదటి వారానికే రూ.25.75 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus