కొద్దిరోజుల క్రితం ‘బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెట్టుకున్నారు’ అంటూ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ (KGF) లోని హీరో ఎలివేషన్ డైలాగ్ తో ఓ స్టోరీని డిస్కస్ చేసుకున్నాం అందరికీ గుర్తుండే ఉంటుంది. మన తెలుగు ఫిలిం మేకర్స్ అనవసరంగా కొన్ని సినిమాల్లోని పాత్రలకి పక్క భాషల్లోని స్టార్స్ ని తెచ్చిపెట్టారు. దాని వల్ల బడ్జెట్ పెరిగింది తప్ప.. ఆ పాత్రలకి అందం రాలేదు. ఆ స్టార్స్ ఇచ్చిన డేట్స్ కి కూడా న్యాయం జరగలేదు అనే చెప్పాలి. పార్ట్ 1 లో కొన్ని సినిమాల్లోని చిన్న, చితకా పాత్రలకి పాపులర్ నటీనటులను తెచ్చి పెట్టిన విధానాన్ని చూశాం. అయితే ఈ 2,3 ఏళ్ళలో వచ్చిన సినిమాల్లోని పాత్రల గురించే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకాస్త వెనక్కి వెళ్లి మరిన్ని వేస్ట్ పాత్రల గురించి మాట్లాడుకుందాం రండి :
1) అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo) – పైడితల్లి
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా (Hero) త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో తెరకెక్కిన ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ మూవీ ఇది. ఇందులో విలన్ సముద్రఖని (Samuthirakani) కొడుకు పైడితల్లి పాత్రకి గోవింద్ పద్మసూర్యని (Govind Padmasoorya) తెచ్చారు. అతను మలయాళంలో పాపులర్ నటుడు. కానీ ఈ సినిమాలో మాత్రం అల్లు అర్జున్ తో తిట్లు తినడం చివరికి కాళ్ళ దగ్గర నలిగిపోవడానికే తెచ్చినట్టు ఉంటుంది. ఈ మాత్రం పాత్రకి తెలుగులో ఎవరిని పెట్టినా సరిపోతుంది.
2) నిశ్శబ్దం (Nishabdham) – మైఖేల్ మ్యాడ్సన్ (Michael Madsen)
అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ (Hemant Madhukar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విలన్ గా హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ ను తీసుకున్నారు. డబ్బులు ఎక్కువై అతన్ని తీసుకున్నారేమో అన్నట్టు ఉంటుంది అతని పాత్ర.
3) మోసగాళ్ళు (Mosagallu) – సునీల్ శెట్టి (Suniel Shetty)
మంచి మంచి విలన్ రోల్స్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ శెట్టిని తీసుకొచ్చి ‘మోసగాళ్ళు’ సినిమాలో ప్రాముఖ్యత లేని పాత్రలో పెట్టాడు విష్ణు (Manchu Vishnu). ఈ సినిమాకి ఆ పాత్ర ఎటువంటి ఇంపాక్ట్ చూపలేదు. అతని కెరీర్ కు కూడా కలిసిరాలేదు.
4) వైల్డ్ డాగ్ (Wild Dog) – దియా మీర్జా (Dia Mirza)
నాగార్జున (Nagarjuna) హీరోగా (Hero) సోలమన్ (Ahishor Solomon) దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీలో బాలీవుడ్ నటి దియా మీర్జాని తీసుకున్నారు. సరిగ్గా 10 నిమిషాలు నిడివి లేని పాత్ర ఇది. అయినప్పటికీ అంత పాపులర్ నటిని ఎందుకు తీసుకున్నారో వాళ్ళకే తెలియాలి.
5) టక్ జగదీష్ (Tuck Jagadish) – డానియల్ బాలాజీ (Daniel Balaji)
నాని (Nani) హీరోగా శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దివంగత స్టార్ డానియల్ బాలాజీని విలన్ గా తీసుకున్నారు. అతని స్థాయి విలనిజం ఈ సినిమాలో ఎంత మాత్రం కనిపించదు.
6) ఖిలాడి (Khiladi) – ఉన్ని ముకుందన్ (Unni Mukundan)
రవితేజ (Ravi Teja) హీరోగా రమేష్ వర్మ (Ramesh Varma) దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీ పెద్ద ప్లాప్ అయ్యింది. అయితే ఇందులో క్యాస్టింగ్ కూడా చాలా కామెడీగా ఉంటుంది. ముఖ్యంగా అప్పుడప్పుడే తెలుగులో పాపులర్ అవుతున్న ఉన్ని ముకుందన్ ను అవసరం లేని పాత్రకు తెచ్చిపెట్టారు. ఆ సినిమాకి బడ్జెట్ ఎలా పెరిగిపోయింది అనడానికి ఒక ఎగ్జామ్పుల్ గా ఈ పాత్రని చెప్పుకోవచ్చు.
7) రాధే శ్యామ్ (Radhe Shyam) – భాగ్య శ్రీ (Bhagyashree)
ఈ సినిమాతో చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది భాగ్య శ్రీ . హైప్ కోసం తప్ప ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ కి ఉన్న ఆర్క్స్ ఏంటో దర్శకుడు రాధా కృష్ణ కుమార్ కు (Radha Krishna Kumar) మాత్రమే తెలిసుండాలి.
8) గని (Ghani) – ఉపేంద్ర (Upendra Rao)
వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి (Kiran Korrapati) దర్శకుడు. ఈ సినిమా కంటెంట్ కంటే క్యాస్టింగ్ కే ఎక్కువ వేస్ట్ బడ్జెట్ అయ్యి ఉంటుంది అని ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. ఇందులో ఉపేంద్ర నటించాడు అని చాలా మంది గుర్తించి ఉండరు. అంత ఘోరంగా డిజైన్ చేశారు ఆ పాత్రను.
9) ది వారియర్ (The Warriorr) – భారతీ రాజా (Bharathiraja)
రామ్ (Ram) హీరోగా లింగుస్వామి (N. Lingusamy) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమాలో భారతీ రాజా నటించాడు అనే సంగతి ఎంత మంది గమనించారో.. దయచేసి కామెంట్స్ రూపంలో తెలుపండి. అంతకు మించి దీని గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు.
10) ఘోస్ట్ (The Ghost) – గుల్ పనగ్ (Gul Panag)
అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. అత్యంత రొటీన్ స్టోరీని నాగార్జున ఎందుకు ఓకే చేశాడు అనేది ఆయనకే తెలియాలి. మరోపక్క ఈ సినిమాలో నాగార్జునకి అక్క పాత్రలో గుల్ పనగ్ ను తీసుకున్నారు. బాలీవుడ్లో ఈమె పాపులర్ నటి. అంతకు ముందు మిస్ యూనివర్స్ కూడా. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న నటికి ఇవ్వాల్సిన పాత్ర అయితే అది కాదు అనే చెప్పాలి.
11) అల్లూరి (Alluri) – కయాదు లోహార్ (Kayadu Lohar)
‘డ్రాగన్’ (Return of the Dragon) అనే తమిళ సినిమాతో ఈమె పేరు మార్మోగి పోయింది. ఎంతలా అంటే ఏకంగా రవితేజ సినిమాలో హీరోయిన్ గా చేసేంతలా. అది ఈమె స్ట్రైట్ తెలుగు మూవీ అవుతుంది అని కొందరు అభిప్రాయ పడ్డారు. అది అత్యంత బాధాకరం. ఎందుకంటే ఈమె 2022 లోనే శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన ‘అల్లూరి’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ విషయం చాలా మందికి తెలీలేదు అంటే ఈమె పాత్ర ఎంత వీక్ గా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
12) వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) – ప్రశాంత్ (Prashanth Thiagarajan)
బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో రాంచరణ్ (Ram Charan) నటించిన ఈ సినిమాతో సీనియర్ హీరో ప్రశాంత్ రీ- ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో అతని పాత్రని పవర్ఫుల్ గా చూపిస్తారు అనుకుంటే.. అలాంటిదేమీ జరగలేదు. ఈ మాత్రం దానికి ప్రశాంత్ ను తీసుకురావడం ఎందుకు అనే కామెంట్స్ కూడా అప్పట్లో వినిపించాయి.
13) మన్మథుడు 2 (Manmadhudu 2) – కీర్తి సురేష్ (Keerthy Suresh)
రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వంలో నాగార్జున (Nagarjuna) ‘మన్మథుడు 2’ చేశాడు. ఇందులో కీర్తి సురేష్ నటించింది అనే సంగతి చాలా మందికి గుర్తుండదు. అంత వీక్ గా ఉంటుంది ఆమె పాత్ర. అలాగే సమంత (Samantha Ruth Prabhu) కూడా వచ్చి వెళ్తుంది.
14) రణరంగం (Ranarangam) – కాజల్ (Kajal Aggarwal) :
సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో శర్వానంద్ (Sharwanand) హీరోగా నటించిన సినిమా ఇది. ఇందులో కాజల్ కేవలం పారితోషికం కోసమే నటించిందేమో అనిపిస్తుంది. ఆమెపై చిత్రీకరించిన పాటని కూడా డిలీట్ చేశారు.
15) సాహో (Saaho) – చుంకీ పాండే (Chunky Panday)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో విలన్ గా బాలీవుడ్ నటుడు చుంకీ పాండే నటించాడు. హిందీ సినిమాలో అతను ఓ బి గ్రేడ్ కమెడియన్. అతన్ని ఎందుకు ఈ సినిమాలో విలన్ గా పెట్టుకున్నారో మేకర్స్ కే తెలియాలి. పోనీ ఇతని విలనిజం ఏమైనా భయపెట్టిందా అంటే… అదీ లేదు. చాలా కామెడీగా ఉంటుంది.