Sreeleela: శ్రీలీల గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజం!

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ క్రేజీ హీరోయిన్ ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు శ్రీలీల.ఏ ముహూర్తం లో ఈమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిందో తెలియదు కానీ, ఈమె రాకతో అప్పటి వరకు టాలీవుడ్ లో చేతినిండా సినిమాలతో బిజీ గా ఉండే స్టార్ హీరోయిన్స్ పూజ హెగ్డే , రష్మిక మరియు కృతి శెట్టి డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం వీళ్లకు టాలీవుడ్ లో అవకాశాలు ఇవ్వడానికి ఏ స్టార్ హీరో మరియు డైరెక్టర్ కూడా సిద్ధం గా లేరు.

ఆలస్యం అయినా మేము శ్రీలీల కోసమే ఎదురు చూస్తాము అంటున్నారు నిర్మాతలు. ఎందుకంటే ఈమె అందం తో తన డ్యాన్స్ తో కూడా థియేటర్స్ కి ఆడియన్స్ ని క్యూ కట్టేలా చేస్తుంది. రీసెంట్ గా విడుదలైన ‘ధమాకా’ చిత్రం అందుకు నిదర్శనం. అప్పటి నుండి ఈమె టాలీవుడ్ లో నిర్మాతల పాలిట దేవత లాగ మారిపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో పది సినిమాలు ఉన్నాయి, అందులో 8 సినిమాలు సెట్స్ మీద ఉండగా, మరో రెండు సినిమాలకు సంతకం చేసింది.

ఇలా ఇండస్ట్రీ లోకి వచ్చిన రెండేళ్లలోనే ఈ స్థాయిలో ఎదిగిన హీరోయిన్ ని మనం ఈమధ్య కాలం లో చూడలేదని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే శ్రీలీల సినిమాల్లోకి రాకముందు MBBS చదువుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆమె పరీక్షలు రాస్తుండేది. ధమాకా సినిమా షూటింగ్ సమయం లో ఒక పక్క షూటింగ్ చేస్తూ మరోపక్క పరీక్షలు రాసేది. ఇప్పుడు ఖాళీ సమయం దొరకడం తో ఆమె వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోతుంది.

ఈమె కన్నడలో ‘కిస్’ అనే చేసింది, అదే ఆమె మొదటి చిత్రం. ఈ చిత్రానికి ముందే (Sreeleela) శ్రీలీల తెలుగు లో ఒక సినిమా చేసింది. అంజలి ప్రధాన పాత్రలో నటించిన ‘చిత్రాంగద’ అనే చిత్రం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఇందులో అంజలి స్నేహితురాలి పాత్రలో సింధు తులాని నటించింది. ఆమెకి సంబంధించిన చిన్ననాటి ఫ్లాష్ బ్యాక్ లో , ఆమె చిన్నప్పటి క్యారక్టర్ ని చేసింది మరెవరో కాదు, శ్రీలీలనే!, ఈ విషయం చాలా మందికి తెలియదు. ఆ చిత్రం లో ఆమెకి సంబంధించిన ఫోటో ని మీరు కూడా చూసేయండి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus