2021 Surprising Movies: 2021లో ఆశ్చర్యపరిచిన తెలుగు సినిమాలు!

కొన్ని సినిమాలు విడుదలకు ముందు నానా హడావుడీ చేస్తాయి, తీరా విడుదలయ్యాక డెడ్ డ్రాప్ అయిపోతాయి. అయితే.. కొన్ని సినిమాలు మాత్రం విడుదలయ్యాక ధమాకా సృష్టిస్తాయి. అలా విడుదల తర్వాత హల్ చల్ చేసి సూపర్ హిట్స్ గా నిలిచిన కొన్ని సినిమాలేమిటో చూద్దాం..!!

జాంబీ రెడ్డి

తెలుగులో మొట్టమొదటి జాంబీ సినిమాగా రూపొందిన చిత్రమిది. హిందీ, తమిళ భాషల్లో కొన్ని జాంబీ సినిమాలోచ్చినప్పటికీ.. లాజికల్ గా ఆడియన్స్ ను ఆకట్టుకున్న సినిమా మాత్రం ఇదే. తేజ సజ్జా కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు పెద్దగా ఆసక్తి రేపలేకపోయినా.. విడుదలయ్యాక మాత్రం ప్రేక్షకుల్ని అలరించింది.

నిన్నిలా నిన్నిలా

2021లో ఒటీటీలో విడుదలైన స్వీటెస్ట్ సినిమాల్లో ఇదొకటి. అంజలి పాపను తలపించే నిత్యామీనన్ నటన, అశోక్ సెల్వల్ క్యారెక్టరైజేషన్, నాజర్ క్యారెక్టర్, సత్య కామెడీ ఇలా అన్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సినిమాలోని వంటకాలు నోరూరిస్తాయి. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు.

ఏ1 ఎక్స్ ప్రెస్

సందీప్ కిషన్ హీరోగా రూపొందిన ఈ చిత్రం తమిళ చిత్రానికి రీమేక్ అయినప్పటికీ.. తెలుగీకరించడంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పాటలు సినిమాని బ్రతికించాయి. అలాగే హాకీ ప్లేయర్ గా సందీప్ నటన కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది.

లవ్ లైఫ్ & పకోడీ

నిజానికి మంచి కాంట్రవర్సియల్ సినిమా ఇది. తెలియక చెల్లెలు వరుస అమ్మాయిని ప్రేమిస్తాడు హీరో. కానీ.. అది తెలియక చేసిన పని కావడంతో చివరికి కంటిన్యూ అయిపోతాడు. అయితే.. ఈ కాన్సెప్ట్ ను చాలా సెన్సిబుల్ గా డీల్ చేశాడు డైరెక్టర్. అందుకే ఈ ఏడాది సర్ ప్రైజ్ చేసిన సినిమాల్లో ఇదొకటి.

సినిమా బండి

మనసులో ప్రతి ఒక్కరూ ఫిలిమ్ మేకరే. ఈ విషయాన్ని ఎంతో హృద్యంగా చెప్పిన చిత్రం “సినిమా బండి”. ఒక ఆటో తోలుకునే యువకుడికి కెమెరా దొరికితే.. దాన్ని పట్టుకొని అతడు సినిమా ఎలా తీశాడు అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. చాలామంది కొత్త నటీనటులను కూడా పరిచయం చేసింది.

బట్టల రామస్వామి బయోపిక్కు

ఒక అడల్ట్ కాన్సెప్ట్ కు కామెడీ జోడించి హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందించిన చిత్రమిది. మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ ఒకరే కావడం సినిమాకి ప్లస్. అలాగే.. అందరూ కొత్తవారే కావడం ఇంకో ప్లస్ పాయింట్.

పచ్చీస్

చాలా చిన్న కాన్సెప్ట్ కి, లాజికల్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్న సినిమా ఇది. విడుదలయ్యే వరకూ ఇలాంటి సినిమా ఒకటుందని కూడా జనాలకు తెలియదు. అలాంటిది అమెజాన్ ప్రైమ్లో విడుదలైన తర్వాత ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

తిమ్మరుసు

కన్నడ సినిమాకు రీమేక్ గా రూపొందినప్పటికీ.. చిన్నపాటి మార్పులతో రూపొంది మంచి విజయం అందుకొంది చిత్రం. సత్యదేవ్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణ.

ఎస్.ఆర్ కళ్యాణమండపం

కొత్త హీరోహీరోయిన్. సింపుల్ లవ్ స్టోరీ, ఆకట్టుకున్న పాటలు. కట్ చేస్తే.. సినిమా సూపర్ హిట్. పాటలు, ట్రైలర్ సినిమాకి ప్లస్ పాయింట్స్ అయితే.. మాస్ అప్పీల్ హైలైట్. ఈ సినిమా కలెక్షన్స్ చాలా ఒటీటీ రిలీజులకు ప్రాణం పోసి థియేటర్ల వైపు నడిపించింది.

ఆకాశవాణి

చాలా సాధారణమైన కథ. ఈ న్యూ ఏజ్ లో కూడా ఇలాంటి సినిమాలు తీస్తున్నారా? అని ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా. ఒటీటీ లోనే రిలీజ్ అయినప్పటికీ.. ఆర్ట్ సినిమా లవర్స్ ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమా మొత్తం రేడియో అంశం బాగా అలరించింది.

రిపబ్లిక్

కల్ట్ సినిమా అని దర్శకనిర్మాతలు పబ్లిసిటీ చేసుకుంటున్నప్పటికీ.. కల్ట్ కాదు కానీ, ఒక మంచి సినిమా అని మాత్రం చెప్పగల చిత్రం “రిపబ్లిక్”. దేవకట్ట హానెస్ట్ మేకింగ్, సొసైటీలోని లోపాలను ఎత్తి చూపిన విధానం గట్రా అన్నీ బాగున్నప్పటికీ.. కథనంలో బలం లోపించింది. అందువల్ల కమర్షియల్ గా వర్కవుట్ అవ్వలేకపోయినా, ఒటీటీలో విడుదలయ్యాక ఆడియన్స్ నుంచి మంచి రిసెప్షన్ అందుకుంది.

కొండపొలం

దర్శకుడు క్రిష్ తనకు నచ్చిన నవలపై ప్రేమతో తెరకెక్కించిన సినిమా “కొండపోలం”. వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా నటించిన ఈ చిత్రం ఓ మంచి పర్సనాలిటీ డవలప్మెంట్ బుక్ లాంటిది. ఎంటర్ టైన్మెంట్ ఎక్స్ పెక్ట్ చేయకుండా సినిమా చూస్తే మాత్రం మంచి అనుభూతినిచ్చే చిత్రం.

పుష్పక విమానం

రాంగ్ ప్రమోషన్స్ వల్ల జనాల్లోకి వెళ్లలేకపోయింది కానీ.. కాన్సెప్ట్ ఏమిటనేది ప్రోపర్ గా ప్రమోట్ చేసి ఉంటే మంచి హిట్ అయ్యే కంటెంట్ ఉన్న సినిమా ఇది. ముఖ్యంగా ఒంటరిగా అపార్ట్ మెంట్లలో ఉండే జంట ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజెప్పే చిత్రమిది.

స్కైల్యాబ్

మంచి మనసున్న సినిమా “స్కై ల్యాబ్”. ప్రాణం మీదకొస్తే మనుషుల మధ్య తారతమ్యాలు మటుమాయమైపోతాయి అనే విషయాన్ని చాలా హృద్యంగా చూపిన సినిమా ఇది. సత్యదేవ్, నిత్యామీనన్, విష్ణు, రాహుల్ రామకృష్ణల పాత్రలు భలే ఉంటాయి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus