తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే పక్క భాషల్లోని సినిమాలను కూడా ఆదరిస్తూ ఉంటారు. మిగతా భాషల్లోని, రాష్ట్రాల్లోని సినీ ప్రేక్షకులు.. లాక్ డౌన్ టైం నుండి అలవాటు చేసుకున్నారు. అందుకే తెలుగులో పక్క రాష్ట్రాలకు చెందిన హీరోలకు కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. మరీ ముఖ్యంగా తమిళ హీరోల సినిమాలకు తెలుగులో బాగా డిమాండ్ ఏర్పడింది. తమిళ డబ్బింగ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆసక్తితో చూస్తుంటారు. సూర్య, కార్తీ చాలా సందర్భాల్లో చెప్పారు కదా.. మమ్మల్ని తెలుగు ప్రేక్షకులు పేమించినట్టు ఎవ్వరూ పేమించరు అని..! వాళ్ళు చెన్నై నుండి ప్రత్యేకంగా ఫ్లైట్ ఎక్కి వచ్చి మరీ వాళ్ళ సినిమా తెలుగు వెర్షన్ ను చూసి వెళ్తుంటారు.
రజినీకాంత్ తర్వాత సూర్య, కార్తీ, విక్రమ్ ల సినిమాలకు ఇక్కడ మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక ఇటీవల కాలంలో విజయ్, శివ కార్తికేయన్ కి మంచి మార్కెట్ ఏర్పడింది. తాజాగా ఎవ్వరూ ఊహించని విధంగా ధనుష్ కూడా ఇక్కడ రూ.15 కోట్ల హీరో అయిపోయాడు. అతను నటించిన ద్విభాషా చిత్రం ‘సార్’ తెలుగులో రూ.30 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేసింది.తెలుగు దర్శకుడు తీసిన సినిమా కాబట్టి ఆ ఫీట్ ను సాధించింది అనుకుంటే పొరపాటే. ఈ సినిమాలో ధనుష్ నటన ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేసి తెలుగులో రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) 2.ఓ :
రజినీకాంత్ – శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.83 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ‘రోబో’ కి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది.
2) రోబో :
రజినీకాంత్ – శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.65 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
3) ఐ :
విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.58 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
4) కబాలి :
రజినీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.38 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
5) కాంచన 2 :
రాఘవ లారెన్స్ హీరోగా నటించి, డైరెక్ట్ చేసిన ఈ హారర్ కామెడీ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.34 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
6) కాంచన 3 :
రాఘవ లారెన్స్ హీరోగా నటించి, డైరెక్ట్ చేసిన ఈ హారర్ కామెడీ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.33 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
7) శివాజీ :
రజనీకాంత్ – శంకర్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.32.7 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
8) విక్రమ్ :
కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.32 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
9) సార్ :
ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజుతో రూ.30 కోట్ల గ్రాస్ మార్క్ ను అందించింది.
10) 24 :
సూర్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.30 కోట్ల గ్రాస్ మార్క్ ను అధిగమించింది.