ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్.. మొదటి మూడు సినిమాలకే స్టార్ అయ్యి కూర్చున్నాడు. తన మొదటి సినిమా ‘చిత్రం’ సూపర్ హిట్ అయ్యింది.. రెండో సినిమా ‘నువ్వు నేను’ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక మూడో సినిమా ‘మనసంతా నువ్వే’ డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ హీరో దెబ్బకు అప్పటి స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ,వెంకటేష్ వంటి వారు కూడా బయపడ్డారు. ‘మనసంతా నువ్వే’ తరువాత ఉదయ్ కిరణ్ చేసిన ‘కలుసుకోవాలని’ ‘శ్రీరామ్’ సినిమాలు కూడా కమర్షియల్ గా బాగానే కలెక్ట్ చేసాయి. కానీ ఆ తరువాత నుండీ సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ఒక్క ‘నీ స్నేహం’ ‘నీకు నేను నాకు నువ్వు’ ‘ఔనన్నా కాదన్నా’ సినిమాలు తప్ప అన్నీ ఫ్లాప్ అయ్యాయి.
తరువాత ఏ సినిమా కూడా ఉదయ్ కిరణ్ ను ఆదుకోలేకపోయింది. ఇతను సంపాదించుకున్న ఫాలోయింగ్ మొత్తం దూరమయ్యిపోయింది. తరువాత అతను చేసిన సినిమాలను ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు. ఇక 2014 లో ఎవ్వరూ ఊహించని విధంగా ఇతను.. ఈ లోకాన్ని విడిచివెళ్ళిపోయాడు. మానసికంగా క్రుంగిపోవడం వల్లే ఇతను అగాయిత్యం చేసుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే దీని వెనుక అసలు కథ ఏంటనేది ఇప్పటి వరకూ ఎవ్వరికీ తెలీదు. అయితే ఇతను చెయ్యాల్సిన కొన్ని సినిమాలు షూటింగ్ దశలోనే ఆగిపోయాయి. అవి చేసుంటే కనుక కచ్చితంగా మంచి కం బ్యాక్ ఇచ్చేవాడేమో అని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి షూటింగ్ మధ్యలో ఆగిపోయిన ఉదయ్ కిరణ్ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం.. ‘సూర్య మూవీస్’ బ్యానర్ పై ఉదయ్ కిరణ్ తో ‘ప్రేమంటే సులువుకాదురా’ అనే ప్రాజెక్ట్ ను మొదలు పెట్టాడు. 40 శాతం షూటింగ్ కూడా పూర్తయ్యింది. కానీ ఎందుకో మధ్యలోనే ఆగిపోయింది.
2)’ప్రత్యూష క్రియేషన్స్’ బ్యానర్ పై ఉదయ్ కిరణ్-అంకితలతో ఓ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. కానీ తరువాత ఆ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ అయ్యింది.
3)ఇక ‘అంజనా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్-ఆశిన్ జంటగా ఓ చిత్రం ప్లాన్ చేసారు. అది కూడా ఆగిపోయింది.
4) బాలకృష్ణ- సౌందర్య ప్రధాన పాత్రల్లో ‘నర్తనశాల’ అనే సినిమాని ప్లాన్ చేసారు. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్ ను.. అభిమాన్యుడి పాత్రకు ఎంపిక చేసుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఉదయ్ తో పాటు సౌందర్య కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు.
5) ఉదయ్ కిరణ్-త్రిష కాంబినేషన్లో ‘జబ్ వి మెట్’ ను తెలుగులో రిమేక్ చెయ్యాలి అనుకున్నారు కానీ ఈ ప్రాజెక్ట్ కూడా సెట్ అవ్వలేదు.
6)ప్రఖ్యాత ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ వారు ‘లవర్స్’ అనే సినిమాని ఉదయ్ కిరణ్,సదా లతో రూపొందించాలని ప్లాన్ చేసారు కానీ ఆ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ అయ్యింది.
7) ‘ఆది శంకరాచార్య’ అనే సినిమా కూడా ఉదయ్ కిరణ్ చెయ్యాల్సిన సినిమా.. నిర్మాత ఆర్థిక సమస్యల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
8) ‘మనసంతా నువ్వే’ ‘నీ స్నేహం’ వంటి హిట్ సినిమాల తర్వాత ఉదయ్ కిరణ్ తో ఎం.ఎస్.రాజు ఓ సినిమా నిర్మించాలి అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ అయ్యింది.
9) విభిన్న చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి కూడా ఉదయ్ కిరణ్ తో ఓ సినిమా ప్లాన్ చేసాడు. కానీ ఆ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ అయ్యింది.
10) దర్శకుడు తేజ కూడా ఉదయ కిరణ్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఓ సినిమా చెయ్యాలి అనుకున్నరట. ఆయనే స్వయంగా ఆ చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నారట.కానీ అది కూడా మొదలు కాలేదు.