Bigg Boss 5 Telugu: ఈవారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా..?

Ad not loaded.

బిగ్ బాస్ హౌస్ లో వారం వారం లోబో ప్రవర్తన వింతగా మారుతోంది. ఫస్ట్ వీక్ లో బాగా ఎంటర్ టైన్ చేసిన లోబో ఇప్పుడు హౌస్ మేట్స్ కి సంకటంగా మారుతున్నాడు. ముఖ్యంగా ఆడవాళ్ల విషయంలో లోబో తన ప్రవర్తనని మార్చుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ అందరూ. నిజానికి రవి, విశ్వ లతో కలిసిన లోబో పూర్తిగా వారిపై డిపెండ్ అయిపోయాడు. రెండోవారం ఈగల్స్, ఉల్ఫ్స్ టాస్క్ లో పార్టిసిపేట్ చేయకపోవడం లోబోకి పెద్ద మైనస్ అయ్యింది.

ఆరోగ్యం బాగోలేదని పక్కకి కూర్చుండిపోయాడు. ఆ తర్వాత తన లవ్ స్టోరీ చెప్తుంటే సినిమా స్టోరీ అని చెప్పిందని ప్రియపై అరిచిన విధానాన్ని హౌస్ మొత్తం ఖండించింది. వీకండ్ నాగార్జున వచ్చి క్లాస్ కూడా పీకారు. ఇక్కడే ప్రియ లోబోని చూస్తుంటే భయమేస్తోందని, ఉరిమి ఉరిమి చూస్తుంటే హౌస్ లో అభద్రతా భావంగా అనిపిస్తోందని నాగార్జునకి కంప్లైట్ చేసింది. అంతకుముందు కూడా హౌస్ మేట్స్ తో లోబో ప్రవర్తన గురించి పింకీ మొరపెట్టుకుంది. వచ్చి టచ్ చేసాడని చెప్పింది.

అప్పుడు సిరి రవికి చెప్పి వార్నింగ్ ఇప్పిస్తానంటూ హామీ ఇచ్చింది. ఇప్పుడు కాజల్ కి మిడిల్ ఫింగర్ చూపించాడు లోబో. దీనిపైన కాజల్ రచ్చ రచ్చ చేసింది. మిడిల్ ఫింగర్ చూపించడం కరెక్టేనా అంటూ మాట్లాడింది. ఇలా లోబో ప్రవర్తన అనేది హౌస్ లో అందరికీ ఇబ్బందిగానే మారింది. అయితే, ఈవీక్ నామినేషన్స్ లో మొత్తం 9మంది ఉన్నారు. అందులో డేంజర్ జోన్ లో లోబో కూడా ఉన్నాడు. నిజానికి రెండోవారం హౌస్ లో బూతులు మాట్లాడిన ఉమాదేవి వీకెండ్ గుంజీళ్లు తీసి లెంపలు వేస్కుంది.

అయినా కూడా బిగ్ బాస్ టీమ్ కాల్ తీస్కుని ఆమెని ఎలిమినేట్ చేసింది. ఇప్పుడు కూడా లోబో ప్రవర్తన వల్ల బిగ్ బాస్ టీమ్ ఇంటికి పంపించేస్తుందా అనేది చూడాలి. మరి ఈవారం అన్ అఫీషియల్ సైట్స్ లో కూాడ లోబో వెనకబడే ఉన్నాడు. మరి ఈవారం సేఫ్ అవుతాడా ఎలిమినేట్ అవుతాడా అనేది ఆసక్తికరం.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus