Bigg Boss 5 Telugu: లోబో విషయంలో ప్రియ ఎందుకు భయపడుతోంది..!

బిగ్ బాస్ హౌస్ లో శనివారం ఎపిసోడ్ అంటే అందరికీ భయమే. ముఖ్యంగా హౌస్ మేట్స్ ఆవారం చేసిన తప్పులు, టాస్క్ లో ఆడిన పద్దతి ఇవన్నీ కూడా హోస్ట్ నిలదీస్తారు అని టెన్షన్ పడుతుంటారు. అయితే,నాగార్జున మాత్రం లైటర్ వే లో టచ్ చేసి వెళ్లిపోతుంటారు. కొన్ని వారాలు హౌస్ మేట్స్ కి ఛాన్స్ ఇస్తారు. అయితే, బిగ్ బాస్ సీజన్ 5లో మాత్రం ఫస్ట్ వీక్ నుంచే వాగ్వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మొదటివారం ఎందుకులే అని వదిలిసేసిన నాగ్ రెండోవారం నుంచీ క్లాస్ లు పీకడం మొదలుపెట్టారు.

ఇందులో భాగంగా లహరి విషయంలో ప్రియ, రవిలకి బాగా పడింది. అలాగే, ఈవారం ఎవరికి పడుతుంది అనేది ఆసక్తినిరేపింది. నామినేషన్స్ అప్పుుడు లోబో ప్రియపై అరిచిన విధానాన్ని చూపించి మరీ లోబోకి క్లాస్ పీకారు నాగార్జున. లోబోకి అంతగా చెప్తున్నా కూడా తను చేసిన మిస్టేక్ అర్ధం కాలేదు. నాగార్జున చెప్తున్నా కూడా కనీసం ప్రియకి సారీ కూడా చెప్పలేదు.

ఒకవైపు దొరికిందే ఛాన్స్ కదా అనుకుని ప్రియ హౌస్ లో నేను అభద్రతగా ఉన్నాను అని, లోబో నన్ను ఉరిమి ఉరిమి చూడటం అనేది నచ్చలేదు అంటూ చెప్పింది. నామినేషన్స్ తర్వతా వచ్చి నన్ను హగ్ చేస్కుని సారీ అని ఏదో చెప్పాడు అని, ఎమోషనల్ అయ్యాడు అని, కానీ ఆ తర్వాత కూడా ఎదురుపడితే ఉరిమి ఉరిమి చూస్తున్నాడని చెప్పింది. హౌస్ లో ఇప్పటివరకూ వచ్చి నాతో మాట్లాడే ప్రయత్నం చేయలేదని కూడా చెప్పింది. ఇంతలా కంప్లైట్ ఇస్తూన్నా, అభద్రతగా ఫీల్ అవుతున్నా కూడా లోబో ప్రియకి సారీ చెప్పకపోవడం, హోస్ట్ గా నాగార్జున చెప్పించకపోవడం అనేది ఆడియన్స్ కి అర్ధం కాలేదు.

అరిచినందుకు లోబోకి సాలిడ్ పంచ్ ఇచ్చిన నాగార్జున ఆ తర్వాత లోబో ఎలా అరిచాడో వీడియో కూడా వేసి మరీ చూపించాడు. ప్రియ ఇక్కడ దొరికిందే ఛాన్స్ అనుకుంటూ లోబో పై కంప్లైట్స్ ఇచ్చింది. ఇదేది లోబోకి అర్ధం కావట్లేదు. హోస్ట్ ఒకటి అడుగుతుంటే వేరే సమాధానం చెప్తున్నాడు. మరి నాగార్జున చెప్పింది ఏ రవినో ఎక్స్ ప్లైయిన్ చేస్తూ డిటైల్ గా చెప్తేనే తప్ప అర్ధం అయ్యేలా కనిపించలేదు. మరి ఈ వారం లోబో ప్రియ పట్ల ఎలా ప్రవర్తిస్తాడు అనేది చూడాలి.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus