నస్లెన్, కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ పెద్దగా చప్పుడు లేకుండా ఆగస్టు 29న తెలుగులో డబ్ అయ్యింది. ఈ సినిమాపై మొదట ఎటువంటి అంచనాలు లేవు.మొదటి రోజు మార్నింగ్ షోలు కూడా డిలే అయ్యాయి. అయితే ఈవెనింగ్ షోలకు పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజు నుండి స్క్రీన్స్, అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగాయి. ‘వేఫేరర్ ఫిలిమ్స్’ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ ఈ చిత్రం 4 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది.
5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసింది. తెలుగులో ఈ సినిమాకి పెరుగుతున్న ఆదరణ చూసి డిస్ట్రిబ్యూటర్ ‘సితార..’ నాగవంశీ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. దీనికి నిర్మాత దుల్కర్ సల్మాన్ తో పాటు టీం అంతా హాజరు అయ్యారు. సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు రాబడుతుండటం పై చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను ఒకసారి గమనిస్తే :
ఏపీ+తెలంగాణ | 3.65 cr (షేర్) |
కేరళ | 15.35 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 6.90 cr |
ఓవర్సీస్ | 28.12 cr |
వరల్డ్ టోటల్ | 54.02 cr (షేర్) |
‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.20 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ..6 రోజుల్లో .. రూ.54.02 కోట్ల లాభాలు అందించింది. మొత్తంగా రూ.34.02 కోట్ల లాభాలు అందించి డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకుంది. తెలుగులో రూ.2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 6 రోజుల్లో రూ.3.65 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రస్తుతానికి రూ.1.10 కోట్ల ప్రాఫిట్స్ అందించింది.