దర్శకులు హీరోలుగా మారడం అనేది కొత్త టాపిక్ ఏమీ కాదు. గతంలో ఎస్వీ కృష్ణారెడ్డి వంటి స్టార్ డైరెక్టర్ హీరోగా మారి ‘ఉగాది’ ‘అభిషేకం’ వంటి సినిమాల్లో నటించారు. అందులో ‘ఉగాది’ హిట్ అయ్యింది. తర్వాత వి.వి.వినాయక్ సైతం ‘సీనయ్య’ అనే సినిమాతో హీరోగా మారుతున్నట్టు ప్రకటన వచ్చింది. ఫస్ట్ లుక్ వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను పక్కన పెట్టినట్టు స్వయంగా వినాయక్ చెప్పుకొచ్చారు.
DC Movie
తెలుగులో ఇలాంటివి అరుదైనప్పటికీ తమిళంలో మాత్రం.. దర్శకులు హీరోలుగా మారి సక్సెస్ అవుతున్న సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. ఉదాహరణకి ఎస్.జె.సూర్యనే తీసుకుందాం. అతను దర్శకుడిగా సక్సెస్ అయిన తర్వాత హీరోగా మారి కొన్ని సినిమాలు చేశాడు. అందులో కొన్ని హిట్లు ఉన్నాయి. ఇప్పుడు యాక్టర్ గానే సెటిల్ అయిపోయాడు. లేటెస్ట్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ కూడా అంతే..!
ఇప్పుడు లోకేష్ కనగరాజ్ కూడా హీరోగా మారేందుకు రెడీ అయ్యాడు. అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో అతను ‘DC’ అనే సినిమా చేస్తున్నాడు. దీనికోసం అతను 2 నెలలు కాల్ షీట్లు ఇవ్వగా.. పారితోషికంగా ఏకంగా రూ.30 కోట్లు అనుకుంటున్నట్టు వినికిడి. ‘DC’ లో లోకేష్ కి జోడీగా బోల్డ్ బ్యూటీ వామిక గబ్బి హీరోయిన్ గా నటిస్తుంది.
ఆమె ఈ సినిమాలో చంద్ర అనే పాత్రలో కనిపించనుంది. అది ఒక వేశ్య పాత్ర అని టీజర్ తో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె ఎక్కువ బోల్డ్ సన్నివేశాల్లో నటించాల్సి ఉందట. అందుకోసమే ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా కోసం ఆమెకు ఏకంగా రూ.2 కోట్లు పారితోషికం ఆఫర్ చేసినట్టు వినికిడి. ‘సన్ పిక్చర్స్’ సంస్థపై కళానిధిమారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.