Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

‘విక్రమ్’ ఇచ్చిన కిక్‌తో లోకేష్ కనగరాజ్ ఏకంగా రజినీకాంత్ కమల్ హాసన్ అనే లెజెండ్స్‌ను డైరెక్ట్ చేస్తాడని వార్తలు రాగానే ఫ్యాన్స్ ఊగిపోయారు. LCU సృష్టికర్త చేతిలో ఈ డ్రీమ్ కాంబో పడితే రికార్డులేనని ఫిక్స్ అయ్యారు. కానీ, ‘కూలీ’ ఫ్లాప్ తర్వాత సీన్ రివర్స్ అయింది. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ చేతికి వెళ్లినట్లు గట్టిగా టాక్.

Lokesh Kanagaraj

లోకేష్ కథలో వయొలెన్స్ ఎక్కువైందని, అందుకే రజినీకాంత్ పక్కన పెట్టారని అంటున్నారు. కానీ అసలు కోణం ఇది కాకపోవచ్చు. ‘విక్రమ్’ తర్వాత లోకేష్ కాస్త దారి తప్పాడా అనే టాక్ మొదలైంది. LCU అనే బ్రాండ్ సృష్టించిన ఆయనే, దానిని పక్కనపెట్టి ‘కూలీ’ లాంటి (మొదట స్టాండలోన్ అనుకున్న) సినిమా చేయడం, అది ఫ్లాప్ అవ్వడం జరిగింది. బహుశా, ఆ ఫ్లాప్ ఎఫెక్ట్ ఈ లెజెండ్స్ ప్రాజెక్ట్‌పై పడి ఉండొచ్చు.

అయితే, ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ మిస్ అవ్వడం లోకేష్‌కు వ్యక్తిగతంగా నిరాశే అయినా, LCU ఫ్యాన్స్‌కు మాత్రం ఇది అతిపెద్ద శుభవార్త. ఒకవేళ లోకేష్ ఈ మెగా మల్టీస్టారర్‌ను టేకప్ చేసి ఉంటే, LCU భవిష్యత్తు మరో మూడేళ్లు వాయిదా పడేది. ‘ఖైదీ 2’ కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ ఫ్యాన్స్, ‘రోలెక్స్’ స్టోరీ కోసం ఆత్రుతగా ఉన్న సూర్య ఫ్యాన్స్ ఇంకెన్నాళ్లు ఆగాలి?

‘కూలీ’ ఫ్లాప్, లోకేష్‌ను తిరిగి తన సొంత గూటికి, తన బలానికి దగ్గర చేసింది. అనవసరమైన డీవియేషన్స్, ప్రయోగాలు పక్కనపెట్టి, తను సృష్టించిన యూనివర్స్‌ను పూర్తి చేయాల్సిన బాధ్యతను గుర్తు చేసింది. ఇప్పుడు ఆయన ముందున్న ఏకైక లక్ష్యం.. ‘ఖైదీ 2’తో బ్లాక్‌బస్టర్ కొట్టి, తన మార్క్ ఏంటో మళ్లీ ప్రూవ్ చేసుకోవడం.

మొత్తానికి, ‘కూలీఫ్లాప్ అవ్వడం, రజినీ కమల్ ప్రాజెక్ట్ చేజారడం.. ఈ రెండు పరిణామాలు LCUను కాపాడాయనే చెప్పాలి. లోకేష్ వ్యక్తిగత కల వాయిదా పడినా, లక్షలాది మంది ఫ్యాన్స్ కల అయిన LCU మాత్రం ఇప్పుడు వేగంగా పట్టాలెక్కనుంది.

స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus