Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్ కనగరాజ్
- July 7, 2026 / 07:10 PM ISTByFilmy Focus Desk
ఆ హీరోయిన్‌కి తెలుగు సినిమాలు లేవు కానీ.. తమిళంలో వరుస సినిమాలు అయితే చేస్తోంది. అందులో విజయాల శాతం చూస్తే.. ఫామ్‌లో లేదు అని కచ్చితంగా చెప్పేయొచ్చు. అలాంటి ఫామ్‌లో లేని హీరోయిన్‌తో రీసెంట్‌గా ఫామ్ కోల్పోయిన దర్శకుడు ఓ సినిమా చేయబోతున్నారు. అయితే ఆయన దర్శకుడిగా కాదు.. నిర్మాతగా. ఆ ఫామ్‌లెస్ హీరోయిన్ రెజీనా కసాండ్రా కాగా.. ఆ ఫామ్ కోల్పోయిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్.
Lokesh – Regina
‘ఖైదీ’, ‘విక్రమ్’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు లోకేశ్ కనగరాజ్. ‘కూలి’ సినిమాతో భారీ వసూళ్లు అందుకున్నా ఆశించిన ఫలితం అందుకోలేక ఫామ్ కోల్పోయారు. ప్రస్తుతం ఆయన ‘DC’ సినిమాతో బిజీగా ఉన్నారు. హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ వీడియో ఇటీవల విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. ఇక నిర్మాతగా ఓ మహిళా ప్రాధాన్య చిత్రాన్ని రూపొందించాలని అనుకుంటున్నారట.

ఈ సినిమాలో హీరోయిన్‌గ రెజీనాను ఎంపిక చేశారని సమాచారం. విశాల్ వెంకట్ అనే తన దర్శక బృందంలోని వ్యక్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని కోడంబాక్కం వర్గాల టాక్. ఈ టాక్ ఇలా నడుస్తుండగా.. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైందని ఓ వార్త బయటకు వచ్చింది. త్వరలో ఈ సినిమా పేరు, కథాంశం తెలిపేలా ఓ టీజర్ వీడియో రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేసే ఉద్దేశంలో ఉన్నారట.
రెజీనా నటించిన రెండు సినిమాలు (‘మరీచిక’, ‘అనంతన్ కాడు’) విడుదలయ్యాయి. ఇప్పుడు ఆమె చేతిలో ‘ఫ్లాష్ బ్యాక్’, ‘మూకుత్తి అమ్మన్ ’ లాంటి తమిళ సినిమాలు.. ‘ది వైవ్స్’, ‘సెక్షన్ 108’ లాంటి హిందీ సినిమాలు ఉన్నాయి. ఇక లోకేశ్ విషయానికి వస్తే.. దర్శకుడిగా ఇటీవల అల్లు అర్జున్ సినిమాను అనౌన్స్ చేశారు. ఇది కాకుండా ‘బెంజ్’, ‘మిస్టర్ భారత్’ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.















