Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

దక్షిణాది సినిమాల పరిధిని పాన్ ఇండియా స్థాయికి చాటిచెప్పిన దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) పేరు ముందు వరుసలో నిలుస్తుంది. ‘ఖైదీ’(Kaithi), ‘విక్రమ్’(Vikram), ‘లియో’ (LEO)వంటి సినిమాలతో తనదైన సినిమా యూనివర్స్‌ను సృష్టించిన లోకేష్, తాజాగా ‘కూలీ’ (Coolie)  అనే భారీ ప్రాజెక్ట్‌తో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను(Rajinikanth)  కలిపి మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాడు. టెక్నికల్ గాను, నటీనటుల పరంగా గాను ఈ సినిమా భారీగా రూపొందుతోంది. తెలుగులో నాగార్జున  (Nagarjuna) , కన్నడ నుండి ఉపేంద్ర (Upendra),, అలాగే బాలీవుడ్ నుండి అమీర్ ఖాన్ (Aamir Khan)  వంటి స్టార్ క్యాస్టింగ్‌ను తెచ్చుకోవడం ద్వారా దేశవ్యాప్త మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్నాడు.

Lokesh Kanagaraj

ఇప్పటికే హిందీ మార్కెట్‌లో తన పేరు బాగా వినిపిస్తున్న తరుణంలో ‘కూలీ’ కోసం లోకేష్ మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు. కానీ ఇదే సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోలతో ఆయన చేయకపోవడంపై కొత్త చర్చ మొదలైంది. గతంలో రామ్ చరణ్‌తో (Ram Charan) ఒక భారీ ప్రాజెక్ట్ ఉంటుందని వార్తలు వచ్చినా, అది అధికారికంగా బయటకే రాలేదు. అలాగే విక్రమ్ విజయానంతరం కొందరు తెలుగు హీరోలు లోకేష్‌కు పార్టీలిచ్చారని, కానీ కథల స్థాయికి వెళ్లలేదని టాక్ ఉంది.

ఇప్పుడిదే చర్చకు దారి తీసింది. లోకేష్ తెలుగులో సినిమాలు చేయకుండా ఉండటానికి కారణం ఏమిటనే ప్రశ్నకు కోలీవుడ్ వర్గాలు ఓ కారణం చూపుతున్నాయి. టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత, ప్రాజెక్ట్ ప్రారంభం కావడానికి ఒకటిన్నర నుంచి రెండేళ్లు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందట. నిర్మాతలు, కథ, డేట్స్ అన్నింటికీ సమన్వయం సాధించాల్సి రావడం, దర్శకుడిని ఎక్కువ కాలం ఒకే ప్రొడక్షన్ హౌస్‌కు కట్టిపడేయడం జరుగుతుందని అంటున్నారు.

తాను ఓ కథను తయారుచేసి వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకునే లోకేష్ లాంటి దర్శకులకు ఇటువంటి వ్యవస్థ ఏమాత్రం సహకరించదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆ కారణంగానే తెలుగు సినిమాలకు ఆయన దూరంగా ఉన్నారని అంటున్నారు. అయితే ఈ మ‌ధ్య బిజీ షెడ్యూల్‌తో ఉన్నా తెలుగు మార్కెట్‌కి లోకేష్ పూర్తి అప్రిచ్చర్ చూపిస్తున్నట్టు కాదు. సరైన టైమింగ్, క్లియర్ ప్లానింగ్ ఉంటే తెలుగులో కూడా ఓ మంచి ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేకపోలేదు.

ఇప్పట్లో అయితే ‘కూలీ’ సినిమాతో ఇండియన్ మార్కెట్‌ను ఊపేస్తానన్న నమ్మకంతో ఉన్న లోకేష్, తర్వాతి ప్రాజెక్ట్‌ను బాలీవుడ్ వైపు మళ్లిస్తాడా? లేక తన సొంత యూనివర్స్‌కు ఇంకొక ఛాప్టర్ తేవాలని చూస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ తెలుగు ఫ్యాన్స్ మాత్రం లోకేష్ నుంచి ఓ మాస్ థ్రిల్లర్ కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు.

‘90s’ డైరెక్టర్ ను ఆ యువ హీరో మధ్యలో వదిలేశాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus