బాలయ్య కామెంట్స్ లో అంత మీనింగ్ ఉందా..ఏకిపారేస్తున్నారుగా?

‘బాలయ్యది చిన్న పిల్లాడి మనస్తత్వం. ఏదీ మనసులో పెట్టుకోడు. దేనికీ లొంగడు.’ అంటూ చాలా మంది చెబుతుంటారు. బాలయ్య తోటి స్టార్ హీరోలు అయిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ .. వంటి వారు ‘సందర్భానుసారం మాట్లాడతారు. కంగారు పడి అసలు విషయాన్ని బయటకు చెప్పరు’ అని కూడా చాలా మంది చెబుతుంటారు. అందుకే బాలయ్య ఏం మాట్లాడినా వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని.. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్న బాలయ్య.. ఈ విషయం పై స్పందించాడు. ‘మోక్షజ్ఞ కోసం మంచి కథను సిద్ధం చేయించాను.

తధాస్తు దేవతలు .. దీవించిన వెంటనే లాంచ్ చేసేస్తాను’ అని బాలయ్య క్లారిటీ ఇచ్చాడు.. అక్కడి వరకూ బాగానే ఉంది. కానీ ‘నందమూరి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మోక్షజ్ఞదే’ అని కామెంట్ చేసి పెద్ద డిస్కషన్ కు తెరలేపాడు. నందమూరి కుటుంబంలో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. మరోపక్క కళ్యాణ్ రామ్ కూడా డీసెంట్ హీరో అనిపించుకుంటున్నాడు. బాలయ్య ఎన్ని సినిమాలు తీసినా.. కళ్యాణ్ రామ్ సినిమాలకు కూడా సమానమైన క్రేజ్ ఏర్పడింది. ఇక పచ్చిగా ఓ విషయం చెప్పాలి అంటే.. నందమూరి ఫ్యామిలీని ఆదుకుంటుంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి.

‘ఎన్టీఆర్ లేకపోతే నందమూరి ఫ్యామిలీ ఏమీ లేదు’ అని కూడా చాలా మంది కామెంట్స్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటప్పుడు.. బాలయ్య ఎందుకు ‘మోక్షజ్ఞ మాత్రమే ఆ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలి’ అని చెప్పాడు? అనే పెద్ద ప్రశ్న ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఈ కామెంట్స్ తో ‘ఎన్టీఆర్ ను కావాలనే బాలయ్య దూరం పెడుతున్నాడు. ఇదే పెద్ద నిదర్శనం’ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ‘బాలయ్య ఒప్పుకున్నా.. లేకపోయినా.. ఎన్టీఆర్ మాత్రమే నందమూరి ఫ్యామిలీ టార్చ్ బేరర్’ అంటూ నెటిజన్లు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus