Bigg Boss 7 Telugu: ఈ లవ్ స్టోరీలు చూడలేమ్ బాబోయ్ అంటున్న ఆడియన్స్..! అసలు తెర వెనుక ఏం జరుగుతోందంటే.!

ఎలాగైనా సరే ఈ సీజన్ ని ఆడియన్స్ లోకి తీస్కుని వెళ్లి , సోషల్ మీడియాలో రచ్చ లేపి ఖచ్చితంగా హిట్ చేయాలని చూస్తోంది బిగ్ బాస్ టీమ్. దీనికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం తమ ఆయుధం అయిన లవ్ స్టోరీస్ కి పదును పెట్టింది. పక్కాగా స్క్రిప్ట్ గానే ఇప్పటివరకూ జరిగిందా అని కూడా అనిపిస్తోంది. అంతేకాదు, ఇక్కడ రతిక పల్లవి ప్రశాంత్ ని బాగా ఫ్లట్టింగ్ చేస్తోంది. అలాగే, మనోడికి బాగా కనెక్ట్ అవుతోంది. ఇదంతా ప్రీ ప్లాన్ ప్రకారమే జరుగుతోందా అనేది ఇక్కడ సందేహం.

అలాగే, టేస్టీ తేజ ఇంకా షకీలా ఇద్దరినీ కన్ఫషన్ రూమ్ లోకి పిలిచి మరీ ఇంట్లో గాసిప్స్ చెప్పమంటే గౌతమ్ – శుభశ్రీ గురించి చెప్పాడు తేజ. మళ్లీ ఏమీ తెలియనట్లుగా వాళ్లిద్దరి దగ్గరకి వెళ్లి మీకు పాజిటివ్ వైబ్స్ అని చెప్పా అంటూ కవర్ చేశాడు. ఆల్రెడీ బిగ్ బాస్ కి కావాల్సిన మెటీరియల్స్ ఇప్పుడిప్పుడే దొరుకుతున్నాయి. పులిహోర కలపడం హౌస్ లో స్టార్ట్ అయ్యింది. ఇక కావాలనే ఈ లవ్ స్టోరీలు అనేవి బిగ్ బాస్ హౌస్ లో కామన్ అయిపోతున్నాయని ఆడియన్స్ మొత్తుకుంటున్నారు.

అంతేకాదు, చాలామంది కామెంట్స్ చేస్తుందేంటంటే., ఈ సీజన్ లో అస్సలు ఇలాంటి లవ్ స్టోరీలు మాకు వద్దే వద్దు అంటూ చెప్తున్నారు. లాస్ట్ టైమ్ ఇనయా చాలా ఎగ్రెసివ్ గా గేమ్ ఆడుతూ వచ్చినా ఈ లవ్ స్టోరీల వల్లే డౌన్ అయిపోయింది. ఇప్పుడు రతిక కూడా గేమ్ లో లాజిక్స్ బాగా వర్కౌట్ చేస్తున్నా కూడా ఈ లవ్ స్టోరీ వల్లే వెనకబడే అవకాశం కనిపిస్తోంది. అలాగే, పల్లవి ప్రశాంత్ కూడా రతిక మాయలో పడి గేమ్ ని దూరం పెట్టేస్తున్నాడు. మరోవైపు శుభశ్రీ ఇంకా గౌతమ్ కృష్ణ వీరిద్దరి మద్యలో కూడా సమ్ థింగ్ సమ్ థింగ్ పెట్టాలనే బిగ్ బాస్ టీమ్ చూస్తోంది.

ఒకవేళ ఇదే స్క్రిప్ట్ వర్కౌట్ చేస్తే మాత్రం ఈసారి సీజన్ అట్టర్ ఫ్లాప్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు బిగ్ బాస్ ఆడియన్స్ ఈ లవ్ స్టోరీలు మేము చూడలేం బాబోయ్ అని మొత్తుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. టాస్క్ లు పెట్టండి, స్కిట్స్ ఆడించండి, అలాగే హీటెడ్ ఆర్గ్యూమెంట్స్ చేస్కోండి. టాస్క్ లో గొడవ పడండి అంతేకానీ, మరోసారి ఈ లవ్ స్టోరీలు, ట్రయాంగిల్ లవ్ స్టోరీలు మేము చూడలేము (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ అంటూ వాపోతున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus