Bigg Boss 5 Telugu: ఉమాకి బెడ్ త్యాగం చేసిన లోబో..!

Ad not loaded.

బిగ్ బాస్ హాస్ లో లవ్ ట్రాక్స్ చూడటం అనేది ఆడియన్స్ కి కొత్తేమీ కాదు. అయితే, ఈసారి ఎలాంటి లవ్ ట్రాక్ చూడాలా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంతలో మేమున్నాం అంటూ ఉమాదేవి అండ్ లోబో ఇద్దరూ రెచ్చిపోయారు. హౌస్ లో క్యూట్ క్యూట్ గా మాట్లాడుతూ కామెడీ చేశారు. ఇక వీళ్లని చూసిన హౌస్ మేట్స్ అందరూ కూడా జోక్స్ పై జోక్స్ వేస్తూ నవ్వుకున్నారు. ఇంతలో ఈ లవ్ స్టోరీ బిగ్ బాస్ కంట్లో కూడా పడింది. ఇక ఊరుకుంటాడా.. వెంటనే వీళ్లకి ఒక స్కిట్ చేయండి. సింగిల్ బెడ్ గెలుచుకోండి అంటూ టాస్క్ ఇచ్చాడు.

ఇక టాస్క్ లో భాగంగా ఆటో డ్రైవర్ అవతారమెత్తిన లోబో పాసింజర్ గా పారిస్ నుంచి వచ్చిన ప్రియాంకని ఎక్కించుకుని హైదరాబాద్ గల్లీల్లో తిప్పాడు. ఇక్కడ ప్రియాంక వేసిన పంచ్ లకి ఇరిటేట్ అయిన లోబో స్కిట్ అక్కడున్న ప్రేక్షకులైన హౌస్ మేట్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత అత్తాకోడళ్లుగా ఉమా సిరి ఒక స్కిట్ చేశారు. అబ్బనీ తీయనీ దెబ్బ అంటూ అత్తగా ఉమాదేవి జాబ్ చేసి వచ్చి అలసిపోయిన కోడలిగా సిరిలు స్కిట్ లో అలరించారు. ఇక్కడే ఉమాదేవి తనదైన స్టైల్లో రెచ్చిపోయింది.

రియాలిటీకి – ఊహకి ఉన్న తేడాని క్లియర్ గా చూపించింది ఈ అత్త. ఈ రెండు స్కిట్స్ చేసిన తర్వాత హౌస్ మేట్స్ లో మెజారిటీ ఓట్లు లోబోకి పడ్డాయి దీంతో సింగిల్ బెడ్ విజేత లోబో అయ్యాడు. ఇక్కడే ట్విస్ట్ ఇచ్చాడు లోబో ఈ బెడ్ ని ఉమాదేవికి ఇచ్చేస్తున్నాను అంటూ మాట్లాడాడు. కానీ ఉమాదేవి సున్నితంగా తిరస్కరించింది. ఇక లోబో బెడ్ లాక్ ని తీసి దానిపై పడుకుని ఆనందించాడు. మరి ఈ బెడ్ త్యాగం చివరకి ఏమవతుందో చూడాలి. అదీ మేటర్.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus