తెలుగు రాష్ట్రాల్లో ఓకే.. కానీ అక్కడ తేడా కొట్టేసింది..!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది ‘ఉప్పెన’ చిత్రం. వైష్ణవ్ తేజ్ ఇప్పటికే చాలా రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రానికి అంత బ్లాక్ బస్టర్ టాక్ ఏమీ రాలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో టీం అంతా ఇవి హైలెట్స్ అంటూ ఓ తెగ డబ్బా కొట్టారు కానీ అదేమీ సినిమాలో లేదనేది విమర్శకుల మాట. అయితే ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి అనే మాట నిజం.ముందు నుండీ పాటల వలనో కొంచెం..

హీరోయిన్ లుక్స్ వలనో కొంచెం.. సినిమా పై క్రేజ్ ఏర్పడింది. వాటి వలనే ప్రధానంగా ఓపెనింగ్స్ నమోదయ్యాయి. సరే ఇక్కడి వ్యవహారం బాగానే ఉంది.. కానీ ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేశారు. అక్కడ మాత్రం ఈ చిత్రం బాగా డౌన్ అయిపోయింది. ముఖ్యంగా అమెరికాలో..! కరోనా భయంతో అక్కడి జనాలు థియేటర్లకు వెళ్లడం లేదు. సుక్కు మార్క్ తో ‘ఉప్పెన’ చిత్రం మళ్ళీ అక్కడ పూర్వ వైభవాన్ని తీసుకొస్తుంది అనుకుంటే..! అక్కడ కూడా ఓపెనింగ్స్ వరకూ పరిమితం అయ్యింది..!

గత రెండు రోజులుగా అయితే అక్కడ $10 డాలర్లు, $డాలర్ల వసూళ్లు మాత్రమే నమోదయ్యాయి. ఇది మరీ దారుణమనే చెప్పాలి..!టెక్సాస్ లో మంచు తుపానుతో జనం విలవిలాడిపోతున్నారు. గత 3 రోజుల నుండీ అక్కడ కరెంట్ లేదు.అందుకే జనం బయటికి రావడం లేదు. బహుశా దీని ఎఫెక్టో లేక అక్కడి జనాలు 3 రేటింగ్ ఇస్తేనే థియేటర్లకు వస్తారు అని ఓ టాక్ ఉంది. ఈ సినిమాకి అంత రేటింగ్ రాలేదు కాబట్టి దాని ఎఫెక్టో..తెలియక ట్రేడ్ పండితులే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus