Lucifer 2: తెలుగులో చిరంజీవి ఈ సినిమా చేస్తారా? చేస్తే ఎవరు?

హీరోగా ఎంత వైవిధ్యమైన నటనను ప్రదర్శిస్తాడో, దర్శకుడిగా అంతలా బలమైన సినిమాలు చేస్తూ ఉంటాడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. ‘లూసిఫర్‌’తో దర్శకుడిగా మారిన పృథ్వీరాజ్‌.. ఇప్పుడు ఆ సినిమాకు రెండో పార్టు కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు చిత్రబృందం ఓ స్పెషల్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. అందులో ప్రత్యేకంగా వివరాలు ఏమీ చెప్పకపోయినా.. ‘లూసిఫర్‌ 2’ వస్తుందని, దానికి పేరు ‘ఎంపురాన్‌’ అని మాత్రం చెప్పాడు. మోహన్‌ లాల్‌ కథానాయకుడిగా ‘2019 లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ‘లూసిఫర్‌’ అనే యాక్షన్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించాడు.

ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులనూ అలరించింది. ఈ సినిమాకు ప్రీక్వెల్‌ కమ్‌ సీక్వెల్‌ అనే కాన్సెప్ట్‌లో మరో సినిమా తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి ‘లూసిఫర్‌ 2: ఎంపురాన్‌’ అనే పేరు పెట్టారు. ఎంపురాన్‌ అంటే రాజు కన్నా గొప్పవాడు అని అర్థమట. ‘లూసిఫర్‌’ విషయానికొస్తే.. ఆ సినిమాలో స్టీఫెన్‌ గట్టుపల్లి అనే రాజకీయ నాయకుడిగా మోహన్‌ లాల్‌ కనిపిస్తాడు. సినిమాలో అంతర్లీనంగా అతను కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు అని చెబుతూ ఉంటారు.

పాలిటిక్స్‌లోకి వచ్చే ముందు స్టీఫెన్‌… ప్రపంచాన్నే శాసించే ఓ మాఫియాకు అధినేత. అసలు పేరు అబ్రహాం ఖురేషి. సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించిన స్టీఫెన్‌.. అబ్రహం ఖురేషిగా ఎలా మారాడు? ఈ క్రమంలో అబ్రహం ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి తదితర అంశాలను ఈ ప్రీక్వెల్‌లో చూపిస్తారట. ఇక ‘లూసిఫర్‌’ను తెలుగులో చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ అంటూ తీసుకొస్తున్నారు. ఈ సినిమాను విజయదశమి కానుకగా విడుదల చేయబోతున్నారు.

సరిగ్గా ఈ సమయంలో మలయాళంలో ‘లూసిఫర్‌ 2’ తెరకెక్కుతుండటం గమనార్హం. ‘గాడ్‌ ఫాదర్‌’ హిట్‌ అయితే.. ‘లూసిఫర్‌ 2’ తెలుగులో ‘గాడ్‌ ఫాదర్‌ 2’గా వచ్చే అవకాశం ఉంది. అయితే తెలుగులో ఆ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు అనేది చూడాలి. తొలి పార్టుకు మోహన్‌ రాజా డైరక్టర్‌ అనే విషయం తెలిసిందే. రెండో పార్టు తీస్తే ఆయన్నే కొనసాగిస్తారా లేక కొత్త దర్శకుడు రంగంలోకి వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus