Naga Shaurya, Anusha Shetty: రాచరికపు స్టైల్ లో నాగ శౌర్య పెళ్లి భోజనాలు.. వైరల్ అవుతున్న వీడియో!

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య పెళ్లి ఈరోజు బెంగళూరులో ఘనంగా జరిగింది. తాను ప్రేమించిన అనూష శెట్టిని ఈరోజు ఉదయం 11 గంటల 25 నిమిషాలకు బెంగళూరులోని జె డబ్ల్యూ మారియట్ ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న ఫంక్షన్ హాల్ లో వివాహం చేసుకున్నాడు. నిన్నటి నుండి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మెహందీ, సంగీత్ వేడుకల్లో నాగ శౌర్య తన ఫియాన్సీతో కలిసి సందడి చేయడం, ఇరు కుటుంబ సభ్యులు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం మనం చూశాం.

ఇక వీరి పెళ్లి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన విందు కూడా ప్రత్యేకాకర్షణగా నిలిచింది.నాగ శౌర్య పెద్ద వ్యాపారవేత్త కొడుకు.. పైగా క్రేజీ హీరో.! ఇక అనూష శెట్టి కూడా వందల కోట్ల ఆస్తి ఉన్న వ్యాపారవేత్త కూతురు. పైగా ఆమె కూడా ఇంటీరియర్‌ డిజైనర్‌. కాబట్టి పెళ్ళికి వచ్చి వధూవరులను ఆశీర్వదించిన గెస్టులు అందరికీ రాచరికపు స్టైల్ లో భోజనాలు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.

అంటే వెండి కంచాల్లో గెస్టులకు భోజనాలు వడ్డించారన్న మాట.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 12 రకాల వంటలు, 4 రకాల స్వీట్స్, పెట్టినట్టు వినికిడి. నాగశౌర్య వివాహానికి టాలీవుడ్ నుండి ఎవ్వరూ హాజరుకాలేదు. ఎవ్వరికీ ఆహ్వానం కూడా వెళ్ళలేదు అని వినికిడి.

నాగ శౌర్య కూడా నిన్న అంటే నవంబర్ 19 ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుండి బెంగుళూర్ కి బయల్దేరాడు. త్వరలో హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట.

1

2

3

4

More..

1

2

3

4

5

6

7

8

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus