బాహుబలి కంక్లూజన్ ప్రీ రిలీజ్ వేడుక సమయంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రస్తుత దర్శకులపై, గీత రచయితలపై చేసిన ట్వీట్స్ వివాదాస్పదమయ్యాయి. కొంతకాలం పాటు వాటిపై చర్చ జరిగింది. అప్పుడు కీరవాణి తనమీద తానే సెటైర్స్ వేసుకొని వివాదాన్ని ముగించారు. మళ్లీ ఇన్నాళ్ళకు తన ట్వీట్ తో రచ్చ లేపారు. ఈరోజు ఉదయం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “బాహుబలి-2 అన్ని పరిశ్రమలకి పెద్ద చిత్రం” అంటూ ట్వీట్ చేశారు. దానికి కీరవాణి స్పందిస్తూ “ఒకవేళ ఇది నిజమైతే ఒక హిందీ సింగర్ బాహుబలి-2 మలయాళం వెర్షన్ లో పాడమంటే అవమానంగా ఫీలై పాడటానికి నిరాకరించారు” అని రీ ట్వీట్ చేశారు.
దీంతో చాలా మంది సోషల్ మీడియా ఫాలోవర్లు సినిమా బాహుబలి-1 సాధించిన విజయం చూసి కూడా బాహుబలి-2 లో పాడేందుకు అవమానంగా భావించి వదులుకున్న ఆ సింగర్ ఎవరనేది తెలుసుకోవాలని ట్వీట్స్ చేస్తున్నారు. కానీ కీరవాణి మాత్రం ఆ సింగర్ ఎవరనేది బయటపెట్టలేదు. అందుకు సమాధానం తెలుసుకోవాలని నెట్లో సెర్చ్ లు, చర్చలు మొదలయ్యాయి. ఇది ఎంతవరకు వెళ్తుందో ఇప్పుడే చెప్పలేము.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.