కీరవాణి జీవిత సుస్వరాలు

సంగీతంలో ఆరోహణలు అవరోహణలు ఉంటాయి. అలాగే సంగీత దర్శకుడు కీరవాణి జీవిత పయనంలో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఉన్నత కుటుంబంలో పుట్టి కష్టం లేకుండా బాల్యాన్నిగడిపారు. యవ్వనంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బతుకుబండిని నడిపించడానికి మ్యూజిక్ డైరక్టర్ కె. చక్రవర్తి వద్ద సహాయ సంగీత దర్శకునిగా సినిమాలకు పనిచేశారు. మ్యూజిక్ డైరక్టర్ గా ఎదిగి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో స్వరాలు కూర్చారు. 221 సినిమాలకు మ్యూజిక్ అందించారు. ఎన్నో అద్భుత పాటలను అందించినా నిగర్విగా ముందుకు సాగుతున్నారు. జూలై 4 న పుట్టిన రోజు జరుపుకుంటున్న కీరవాణి గురించి ఆసక్తికర సంగతులు ఇవి.

మూడు రాష్ట్రాలతో అనుబంధంకర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో పెరిగారు. మద్రాస్ లో ఎక్కువ కాలం జీవించారు. ఇప్పుడు హైదరాబాద్ లో నివసిస్తున్నారు.

మనసు మమతఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ డైరక్టర్ గా తొలిసారి కల్కి (1990) సినిమాకి పనిచేశారు. కానీ ఆ చిత్రం విడుదల కాలేదు. అదే ఏడాది మనసు మమత సినిమా టైటిల్స్ లో ఆయన పేరు చూసుకున్నారు.

కథలు రాయగలరు ..కీరవాణి సంగీతం కాకుండా పుస్తకాలు బాగా చదువుతారు. ఓషో రచనలు బాగా ఇష్టం. కథలు కూడా రాసారు. సినిమా కథల సిట్టింగ్ లో కూర్చొని మార్పులు చెప్పారు. మూవీ ప్రీ ప్రొడెక్షన్ లో పాలు పంచుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు.

క్షణం క్షణం1991లో వచ్చిన రామ్ గోపాల్ వర్మ మూవీ క్షణం క్షణం తో కీరవాణి లైమ్ లైట్ లోకి వచ్చారు. “జాము రాతిరి జాబిలమ్మ” వంటి మెలోడీలతో సంగీత ప్రియులను కట్టి పడేసారు.

మాతృ దేవోభవ పాట అంకితం“రాలిపోయి పువ్వా నీకు రాగాలెందుకే” పాట కీరవాణికి మంచి పేరు తెచ్చి పెట్టింది. చాలా ఇష్టమైన పాట కూడా. ఈ పాట అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి చాలా ఇష్టం. మనసు బాగాలేనప్పుడు వింటుండేవారు. ఆ విషయం తెలిసి కీరవాణి స్పెషల్ గా రికార్డ్ చేసి తారక్ కి ఇచ్చారు. అప్పటినుంచి ఆ పాటను అతని సమక్షంలో మాత్రమే పాడతారు. ఆయన లేని సభలో పాడరు.

క్రిమినల్బాలీవుడ్లోకి 1995 లో అడుగుపెట్టారు. హిందీ క్రిమినల్ సినిమాకు సంగీతం అందించారు. అప్పుడు అదొక సంచలన మయింది.

మూడు పేర్లుతెలుగు వారికి కీరవాణి తెలిసిన ఈ స్వర వాణి బాలీవుడ్ లో ఎం.ఎం. క్రీమ్ గా పరిచయమయ్యారు. అతన్ని తమిళం, మలయాళంలో మరకత మణి అని పిలుస్తారు.

అన్నమయ్యఅన్నమయ్య సినిమాకు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా కీరవాణి అవార్డు అందుకున్నారు. ఇందులోని పాటలను ఇప్పటికీ దేవాలయాల్లో ప్లే చేస్తుంటారు. ఈ పాటలు అంతగా ప్రజల్లోకి వెళ్లాయి.

బాలు కోసం ..

 

ప్రముఖ గాయకులు ఎస్.పి. బాలసుబ్రమణ్యం గాయకుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా కీరవాణి “యాభై వసంతాలు శ్రవణామృతం కురిసెనే బాలు గారి గళము” అనే పాటను పాడి యూట్యూబ్లో విడుదల చేశారు.

బాహుబలిఎస్.ఎస్.రాజ మౌళి చిత్రాలకు అన్నింటికి సంగీతాన్ని ఇచ్చిన కీరవాణి బాహుబలితో ప్రపంచ ఖ్యాతి ఆర్జించారు. ఈ చిత్రానికి బ్యాగ్ గ్రౌండ్ స్కోర్, పాటలు వెన్నుగా నిలిచాయి.

షేక్ హ్యాండ్ గురించి..

చైతన్య ప్రసాద్ షేక్ హ్యాండ్స్ మీద పద్యం రాయగా దాన్ని కీరవాణి పాడి వినిపించారు. “చాలు చాలు ఇంక కరచాలనాలు” అంటూ షేక్ హ్యాండ్స్ చేయొద్దని హాస్యభరితంగా చెప్పారు. ఈ పద్యం యూ ట్యూబ్ లో ఎక్కువమంది చూసారు.


ఎవర్ గ్రీన్ సాంగ్స్


ఎం.ఎం.కీరవాణి తనకి నచ్చిన కథలకు సంగీతం ఇవ్వడానికి ఒప్పుకుంటారు. మనసు పెట్టి కంపోజ్ చేస్తారు. అందుకే ఆయన స్వరపరిచిన గీతాలు మనసును హత్తుకుంటాయి. కొన్ని గుండెను కరిగించి కన్నీటిని తెప్పిస్తే.. మరికొన్ని భక్తి భావాన్ని పెంపొందిస్తాయి. కాలుని కదిలించే హుషారైన పాటలు మరకత మణి లెక్కలేనన్ని ఇచ్చారు. ఆయన పాటల్లో ఇప్పటికీ, ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని సాంగ్స్ మీ కోసం…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus