Karate Kalyani: కరాటే కళ్యాణికి భారీ షాకిచ్చిన మా అసోసియేషన్.. ఏం జరిగిందంటే?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కరాటే కళ్యాణికి భారీ షాకిచ్చింది. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో షాకింగ్ ఆరోపణలు చేయడంతో కరాటే కళ్యాణి వివాదంలో చిక్కుకున్నారు. ఈ వివాదం విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కరాటే కళ్యాణికి గతంలో షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఈ నోటీసుల గురించి కరాటే కళ్యాణి స్పందించలేదని సమాచారం అందుతోంది. సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం గురించి ఆమె చేసిన కామెంట్లు నందమూరి అభిమానులకు కోపం తెప్పించాయి.

అయితే ఆ వివాదం వల్ల 16వ తేదీన నోటీసులు జారీ కాగా సరైన స్పందన లేకపోవడంతో ఆమెను సస్పెండ్ చేసినట్టు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నియమాలను కరాటే కళ్యాణి ఉల్లంఘించారని అందువల్లే ఆమెను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని అసోసియేషన్ సభ్యులు చెబుతుండటం గమనార్హం. తనను సస్పెండ్ చేయడంపై కరాటే కళ్యాణి ఎలా స్పందిస్తారో చూడాలి.

కరాటే కళ్యాణికి (Karate Kalyani) వివాదాలు కొత్త కాదు. గతంలో కూడా పలు వివాదాల ద్వారా ఆమె వార్తల్లో నిలిచారు. అనవసర వివాదాల వల్ల కొన్నిసార్లు సోషల్ మీడియాలో కూడా కరాటే కళ్యాణిపై ట్రోల్స్ వస్తున్నాయి. ఎంతో టాలెంట్ ఉన్న కరాటే కళ్యాణి వివాదాల ద్వారా వార్తల్లో నిలవడం సినీ అభిమానులకు సైతం నచ్చడం లేదు. కరాటే కళ్యాణి తన పద్ధతిని మార్చుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు.

సీనియర్ ఎన్టీఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఆమెపై చర్యలు తీసుకున్నారని బోగట్టా. కరాటే కళ్యాణిపై సస్పెన్షన్ ఎన్నిరోజుల పాటు కొనసాగుతుందో తెలియాల్సి ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కరాటే కళ్యాణికి వరుస షాకులు తగులుతున్నాయి. కరాటే కళ్యాణి జాగ్రత్త పడకపోతే ఆమె కెరీర్ ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus