కోయిల ముందే కూసింది అన్నట్లు… నటుడు ప్రకాశ్‌రాజ్ చాలా రోజుల క్రితమే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల నగారా మోగించేశారు. ఆ తర్వాత విమర్శలు, ప్రతివిమర్శలు, లేఖలు, ప్రెస్ నోట్‌లు, ప్రెస్ మీట్లు అంటూ వాతావారణ వేడెక్కింది. అయితే అధికారికంగా ‘మా’ ఎన్నికల నగారా మోగలేదు. అయితే మూడు, నాలుగు రోజుల్లో ‘మా’ ఎన్నికల విషయంలో ఓ క్లారిటీ వచ్చేస్తుందని సమాచారం. సాధారణంగా ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకుంటూ ఉంటారు.
అలాంటి సమావేశాన్ని ఈ వారంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. బుధవారం లేదా గురువారం ఈ సమావేశంలో వర్చువల్ విధానంలో నిర్వహిస్తారు. అందులో మొత్తంగా చర్చించి, పరిస్థితుల్ని అంచనా వేసి ‘మా’ అధ్యక్ష ఎన్నికల విషయంలో ప్రకటిస్తారట. ‘మా’ఎన్నికలు ఎప్పుడూ అంటూ కొన్ని రోజుల క్రితం ప్రకాశ్‌రాజ్ ఓ ట్వీట్ చేశారు. దాని మీద రకరాల స్పందన వచ్చినా… ఈసీ సమావేశాన్ని గుర్తు చేస్తూనే ఆయన ఆ ట్వీట్ చేశారని తెలుస్తోంది.
అయితే ఇప్పటివరకు జరిగిన ఈసీ సమావేశాలు, ఇదీ ఒకలా ఉండదు అని అర్థమవుతోంది. ‘మా’ మసకబారింది అంటూ మొదలైన విమర్శలు, ప్రతివిమర్శలు ఈ మీటింగ్‌లో ఏ స్థాయికి వెళ్తాయో చూడాలి. ముందుగా అనుకున్న ప్రకారం అయితే సెప్టెంబరులో ఎన్నికలు నిర్వహిస్తారని భోగట్టా.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!