స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ చేసి 3 యేళ్ళు దాటింది. గతేడాది ఆమె నిర్మాణంలో తెరకెక్కిన ‘శుభం’ లో ఓ ముఖ్య పాత్ర పోషించింది. కానీ ఎక్కువ నిడివి కలిగిన పాత్ర కాదు. కాబట్టి.. ఆమె కొత్త సినిమా కోసం సమంత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. మొత్తానికి ఆమె ‘మా ఇంటి బంగారం’తో(Maa Inti Bangaaram) ప్రేక్షకుల ముందుకు రానుంది. అనేక సార్లు వాయిదా పడుతూ జూన్ 14న ఈ సినిమా విడుదల కానుంది.
ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్, ‘తస్సాదియ్యా’ సాంగ్ వంటివి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. సినిమాపై బజ్ ఏర్పడేలా చేశాయి. అందుకే సమంత కూడా ఈ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోషన్ చేసింది. ఒక్కరోజే ఏకంగా 40 ఇంటర్వ్యూలు ఇచ్చి ఈ సినిమాని గట్టిగా పుష్ చేసే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా… ఆల్రెడీ ఈ చిత్రాన్ని సమంత ఇండస్ట్రీలో తన స్నేహితులకి చూపించడం జరిగిందట.
సినిమా చూశాక వాళ్ళు.. తమ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం.. ‘మా ఇంటి బంగారం’ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలతో ఉంటుందట. సమంత క్యూట్ ఎక్ప్రెషన్స్, కామిడీ టైమింగ్, ప్రీ ఇంటర్వల్ బ్లాక్ వద్ద వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఆకట్టుకుంటాయట. ఇంటర్వల్ ఎపిసోడ్ సెకండాఫ్ పై ఆసక్తి పెంచేలా డిజైన్ చేసిందట దర్శకురాలు నందినీ రెడ్డి. ఇక సెకండాఫ్ లో సమంత శారీలో చేసే యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ టాప్ నాచ్ అనే విధంగా ఉంటాయట.
‘మా ఇంటి బంగారం’ కి క్లైమాక్స్ ప్రాణం అని చెబుతున్నారు. సమంత హజ్బెండ్ ట్రాక్ కి సంబంధించిన ఒక ట్విస్ట్ బాగా వర్కౌట్ అవుతుంది అంటున్నారు. మాస్ ఆడియన్స్ కి ముఖ్యంగా సమంత అభిమానులకి ఆ క్లైమాక్స్ బాగా కనెక్ట్ అవుతుంది అంటున్నారు. మరి రిలీజ్ రోజు ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి..!