Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘ఖుషి’ తర్వాత సమంత ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ చేసిన సినిమా ఏమీ రాలేదు. ‘శుభం’ లో కెమియో ఇచ్చింది. కానీ దాంతో అభిమానులు సంతృప్తి చెందలేదు. మొత్తానికి 3 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘మా ఇంటి బంగారం’తో(Maa Inti Bangaaram) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సమంత. ఆమె స్నేహితురాలు నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్లో ‘ఓ బేబీ’ అనే హిట్ సినిమా వచ్చింది. దీంతో ‘మా ఇంటి బంగారం’ పై మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Maa Inti Bangaaram

టీజర్, ట్రైలర్స్ అనేవి టార్గెటెడ్ ఆడియన్స్ కు నచ్చాయి. దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. బిజినెస్ అయితే బాగానే జరిగింది. కానీ నిర్మాత లాభాల బాట పట్టాలి అంటే ధియేట్రికల్ గా కూడా బాగా కలెక్ట్ చేయాలి. ఒకసారి ‘మా ఇంటి బంగారం’ ధియేట్రికల్ బిజినెస్ అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్ ను గమనిస్తే

నైజాం 3 cr
సీడెడ్ 1 cr
ఆంధ్ర(టోటల్) 3 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 7 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 2 cr
వరల్డ్ వైడ్ టోటల్ 9 cr

‘మా ఇంటి బంగారం’ సినిమాకి వరల్డ్ వైడ్ గా  రూ.9 కోట్ల  ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం  అల్మోస్ట్ రూ.10 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus