Maa Neela Tank Review: మా నీళ్ళ ట్యాంక్ సినిమా రివ్యూ & రేటింగ్!

యువ కథానాయకుడు సుశాంత్ డిజిటల్ డెబ్యు “మా నీళ్ళ ట్యాంక్”. ప్రియా ఆనంద్ కథానాయకిగా నటించిన ఈ 8 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ కు “వరుడు కావలెను” ఫేమ్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించగా.. కమెడియన్ సుదర్శన్ కీలకపాత్ర పోషించాడు. సిరీస్ టైటిల్ & ట్రైలర్ మంచి గ్రామీణ నేపాధ్యాన్ని పరిచయం చేశాయి. రాయలసీమ యాస, పల్లె సౌందర్యం, నేటివిటీ రీజనల్ ఆడియన్స్ ను బాగానే అట్రాక్ట్ చేసింది. సో, సిరీస్ ఎలా ఉందో చూద్దాం..!!

కథ: పోలీస్ ఆఫీసర్ గా ఏదో సాధించేద్దాం అనే తపనతో డ్యూటీలో చేరిన వంశీ (సుశాంత్)కి ఊర్లో పెట్టీ కేసులు కాదు కదా కనీసం చిన్నపాటి గొడవలు కూడా లేక.. అసలేం చేస్తున్నాడో క్లారిటీ లేక, ఆ ఊరు నుండి ఎప్పుడు ట్రాన్స్ఫర్ తీసుకుని బయటపడదామా అని ఎదురుచూస్తూ ఉంటాడు. ఆ తరుణంలో.. ప్రెసిడెంట్ గారి అబ్బాయి గోపాల్ (సుదర్శన్) పెళ్లి చేసుకోవాలనుకున్న సురేఖ (ప్రియా ఆనంద్) ఊరు నుండి పారిపోతుంది. ఆమెను తిరిగి తీసుకొస్తే ట్రాన్స్ఫర్ ఇప్పిస్తానని చెబుతాడు.

సురేఖ కోసం వెతుక్కుంటూ వెళ్ళిన వంశీకి ఆమెపై ప్రేమ పుడుతుంది. కానీ.. ట్రాన్స్ఫర్ ముఖ్యమా, ప్రేమ ముఖ్యమా అనే కన్ఫ్యూజన్ లో ఎటూ తేల్చుకోలేక తికమకపడుతుంటాడు. చివరికి వంశీ-సురేఖలు కలిశారా? అసలు ఈ నీళ్ళ ట్యాంక్ ఏమిటి? అనేది “మా నీళ్ళ ట్యాంక్” సిరీస్ చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: బేసిగ్గా.. సుశాంత్ కి, క్యారెక్టరైజేషన్ కి, నటనకి అస్సలు పొంతన కుదరలేదు. అందులోనూ రాయలసీమ యాస మాట్లాడడానికి, డైలాగులు చెప్పడానికి, ఆ యాసలో మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందిపడ్డాడు. దర్శకురాలు సుశాంత్ ను సన్నివేశానికి తగ్గట్లు ప్రిపేర్ చేయడంలో దర్శకురాలు లక్ష్మీ సౌజన్య ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. చాలా సన్నివేశాల్లో సుశాంత్ నటనకు, సందర్భానికి, ఎమోషన్ కు అస్సలు సంబంధం ఉండదు.

ప్రియా ఆనంద్ మాత్రం తన క్యారెక్టర్ కి బాగానే న్యాయం చేసింది. ఆమె మేకప్ విషయంలో, ముఖ్యంగా కనుబొమ్మల విషయంలో ఇంకాస్త కేర్ ఫుల్ గా ఉండాల్సింది. సుదర్శన్ తన క్యారెక్టర్ తో కంటే.. యాసతోనే ఎక్కువగా నవ్వించాడు. ఆ క్యారెక్టర్ కి మంచి స్కోప్ ఉన్నప్పటికీ.. సదరు పాత్రను తీర్చిదిద్దిన విధానం ఆడియన్స్ కు ఎక్కలేదు. అలాగే.. నీరోష, ప్రేమసాగర్, రామరాజ్, దివి, అప్పాజీ అంబరీష్, బిందు చంద్రమౌళి తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: లక్ష్మీ సౌజన్య తన దర్శకత్వ ప్రతిభతో ఆకట్టుకోలేకపోయింది. ప్రోపర్ సీన్ కంపోజిషన్స్ కానీ.. ఎమోషనల్ ఎలివేషన్స్ కానీ మచ్చుకకైనా కనిపించలేదు. ఎలాంటి కాంప్లికేషన్స్ లేని ఓ సాధారణ కథను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంలో ఆమె విఫలమైందనే చెప్పాలి. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ అన్నీ సోసోగానే ఉన్నాయి.

విశ్లేషణ: ఆడియన్స్ ను నేటివిటీతో మ్యాజిక్ చేస్తున్న ఈ తరుణంలో.. మంచి స్కోప్ ఉన్న కథ-కథనం-క్యాన్ వాస్ ను సరిగా వినియోగించుకోలేక, చతికిలిపడిన సిరీస్ “మా నీళ్ళ ట్యాంక్”. సో, సుశాంత్ డిజిటల్ డెబ్యూ వర్కవుటవ్వలేదనే చెప్పాలి.

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus