‘మేడమ్‌ చీఫ్ మినిస్టర్‌’ ప్రారంభం!

ఎస్‌.ఆర్‌.పి ప్రొడక్షన్స బ్యానర్‌పై తొలి చిత్రంగా రూపొందుతున్న ‘మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌’ శనివారం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. డా.సూర్య రేవతి మెట్టకూరు కథానాయికగా నటిస్తూ స్వీయ దర్శకనిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి రేవతి క్లాప్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి పట్నం మహేఽందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రేవతిగారి మాటల్ని బట్టి చూస్తే సోసైటీకి సంబంధించిన చిత్రంగా అనిపించింది. 5 భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ఆడాలి’’ అని అన్నారు.

నటి దర్శకనిర్మాత రేవతి మాట్లాడుతూ..
బాగా చదువుకోవాలనే తపనలో అమెరికా వెళ్లా.. సక్సెస్‌ఫుల్‌ చదువు పూర్తి చేశా. ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ చేశా. పబ్లిక్‌ అడ్మినిసే్ట్రషనలో డాక్టరేట్‌ చేశా. అక్కడొక కంపెనీ ప్రారంభించా. అమెరికాలో ఉన్నా దేశాన్ని మాత్రం మరచిపోలేదు. అక్కడ నన్ను భరతమాత ముద్దు బిడ్డగా చూసేవారు. అక్కడ నన్ను గుర్తించడానికి కారణం మన దేశం. మన నడవడిక. మనం తల్లిదండ్రులు, గురువు, రుణం తీర్చుకుంటాం. సామాజిక రుణం అంటే దేశ రుణం మాత్రం మరచిపోతాం. దేశం కోసం ఏం చేద్దాం అనుకుంటున్న తరుణంలో చాలా ఆలోచనలున్నాయి. ఓ విలేజ్‌ని అడాప్ట్‌ చేసుకున్నా. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్‌ స్కూల్‌తో సమాఽనంగా అభివృద్ధి చేశా. నా సంపదలో 20 శాతం సోసైటీ తీసేశా. ఇప్పటికి 5 గ్రామాలను దత్తత తీసుకున్నా. జనాల్లో మార్పు కోసం ఈ పని చేస్తున్నా. ఏడేళ్లగా నేను చేస్తున్న నా సేవలను గుర్తించి రాష్ట్రపతి నుంచి అవార్డు వచ్చింది. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జెడ్‌పి ఛైర్‌పర్సన శ్రీమతి సునీత మహేందర్‌ రెడ్డి ప్రొటోకాల్‌తో వచ్చి నన్ను సత్కరించారు. ప్రస్తుతం సమాజం ఉన్న పరిస్థితులను చూసి ఓ సినిమా ద్వారా ఆ పరిస్థితులను చెప్పాలనిపించింది. సినిమా అనేది సమాజంపై అత్యంత ప్రభావం చూపించే మీడియా. అందుకే మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌ సినిమా ప్రారంభించా. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం ఉంటుంది. యువతను బాగా కనెక్ట్‌ అవుతుంది. ఇది పొలిటికల్‌ సినిమా కాదు.. పబ్లిక్‌ మూవీ. ప్రపంచంలో ఇండయా అనేది చాలా గొప్పది అని చెప్పాలి. అదే నా గోల్‌. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తా’’ అని అన్నారు.

సుహాస్‌ మీరా, ఎస్‌.బి.రామ్‌ (డా.సూరి భసవంతం ఫౌండేషన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

సాంకేతిక నిపుణులు
కథ-నిర్మాత-దర్శకత్వం : సూర్య రేవతి మెట్టకూరు.
మాటలు-స్ర్కీనప్లే : సుహాస్‌ మీరా
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌, ప్రొడక్షన డిజైనర్‌! రామకృష్ణ పాలగాని,
సంగీతం : కార్తీక్‌ బి.కొండకండ్ల
కెమెరా: వల్లెపు రవికుమార్‌
ఎడిటర్‌ : సురేశ దుర్గం
సాహిత్యం: పూర్ణాచారి
ప్రొడక్షన ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌ : ఎం.వెంకట చందుకుమార్‌
పిఆర్‌ఓ: మధు విఆర్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus