విశాల్ (Vishal) హీరోగా అంజలి (Anjali), వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) కాంబినేషన్లో వచ్చిన ‘మదగజరాజ’ (Madha Gaja Raja) సినిమా 12 ఏళ్ళ తర్వాత తమిళంలో 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. అసలు ఈ సినిమా ఒకటి ఉందని కూడా ఆడియన్స్ మర్చిపోయారు. జనవరి 12న రిలీజ్ అంటే.. ముందు ఎక్కువగా ప్రమోషన్ చేసింది కూడా లేదు. అయితే పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడంతో.. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని రూ.50 కోట్ల పైనే వసూళ్లు సాధించింది ఈ సినిమా.
అయితే తెలుగులో జనవరి 31న రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడి ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. హీరోయిన్ల గ్లామర్, సంతానం (N. Santhanam), మనోబాల కామెడీ.. వల్ల బి,సి సెంటర్స్ లో ఓ మోస్తరు ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ప్రమోషన్ డోస్ సరిపోకపోవడం వల్ల.. మిగిలిన చోట్ల నిలబడలేదు. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.35 cr |
సీడెడ్ | 0.16 cr |
ఉత్తరాంధ్ర | 0.32 cr |
ఈస్ట్ | 0.83 cr |
‘మదగజరాజ’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ మొదటి వారం పూర్తయ్యేసరికి కేవలం రూ.0.83 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.67 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇక తాజాగా ‘పట్టుదల’ ‘తండేల్’ వంటి కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి కాబట్టి ‘మదగజరాజ’ కి కష్టమే.