Madhavan: ఆ ప్రచారంలో నిజం లేదంటున్న మాధవన్!

  • August 17, 2022 / 05:54 PM IST

ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ‘రాకెట్రీ:ది నంబి ఎఫెక్ట్‌’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో మాధవన్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకుడిగా కూడా పని చేశారు. డైరెక్టర్ గా మాధవన్ కి ఇది తొలి సినిమా. ఈ సినిమా అందరికీ రీచ్ అవ్వాలని చాలా కష్టపడ్డారు మాధవన్. ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొన్నారు. ఫైనల్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది.

అలానే ఓటీటీలో కూడా ఈ సినిమా బాగానే వర్కవుట్ అయింది. నిర్మాతలకు ఈ సినిమా మంచి లాభాలను తీసుకొచ్చింది. అయితే మాధవన్ ఈ సినిమా బడ్జెట్ కోసం నిధులు సేకరించే క్రమంలో తన ఇంటిని అమ్మేశారంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. నిజానికి ఈ సినిమాకి మొదట మాధవన్ దర్శకుడు కాదని.. ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయాల్సిందని.. కానీ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో ఆయన తప్పుకున్నట్లు కథనం ప్రచురించింది.

దీంతో మాధవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాల్సి వచ్చిందని రాసుకొచ్చారు. ఇదే స్టోరీలో మాధవన్ కుమారుడు వేదాంత్ స్విమ్మింగ్ లో దేశం తరువాత పాల్గొని బంగారు పతకాలు సాధించాడంటూ మాధవన్ కుటుంబాన్ని కీర్తించారు. తాజాగా ఈ ఆర్టికల్ పై మాధవన్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఏమని రాసుందంటే..

‘ఓ యార్.. నేనేదో గొప్ప త్యాగం చేశానని మీరు నన్ను ఆకాశానికి ఎత్తేయద్దు.. ఎందుకంటే నేను నా ఇల్లే కాదు.. దేన్నీ కోల్పోలేదు. దేవుడి దయవల్ల రాకెట్రీ సినిమాలో పాలు పంచుకున్న అందరూ ఈ ఏడాది ఎక్కువ ఆదాయపన్ను చెల్లించనున్నారు. అంత గొప్పగా, గర్వించదగ్గ లాభాలు వచ్చాయి. నేను ఇప్పటికీ నా ఇంటిని ప్రేమిస్తున్నాను. అదే ఇంట్లో జీవిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus