RC15: శంకర్‌ సినిమా కోసం ‘రాకెట్రీ’ హీరో వస్తున్నాడట!

రామ్‌చరణ్‌ – శంకర్‌ సినిమా మొదలై చాలా రోజులైంది. కొన్ని షెడ్యూళ్ల చిత్రీకరణ కూడా పూర్తయింది. అయితే ఇప్పటికీ సినిమా కాస్టింగ్‌ ఎంపిక జరుగుతోంది తెలుసా? అదేంటి… ఇంకా నటుల ఎంపిక జరుగుతోందా? అంటారా? టాలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం అయితే సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మాధవన్‌ను సంప్రదించారని తెలుస్తోంది. ఈ సినిమాలో కార్పొరేట్‌ విలన్‌ పాత్ర ఒకటి ఉందని, చాలా స్టయిలిష్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఆ పాత్ర కోసమే మాధవన్‌ను అడిగారని టాక్‌.

శంకర్‌ సినిమాల్లో విలన్లకు కూడా మేకోవర్‌ ఉంటుంది. అప్పటివరకు ఆ నటుడి లుక్‌, యాటిట్యూడ్, నటన ఒకలా ఉంటే.. శంకర్‌ సినిమాలోకి వచ్చాక అంతకుమించి ఉంటాయి అంటుంటారు. ఇప్పుడు మాధవన్‌ పాత్ర కూడా అలానే ఉంటుంది అని చెబుతున్నారు. కార్పొరేట్‌ లుక్‌ విలన్‌ కాబట్టి క్లాస్‌ ఉండి సూటు బూటు వేసుకుంటాడు అనుకోవద్దు అని చెబుతున్నారు. అంత కొత్తగా ఉండబట్టే మాధవన్‌ ఆ పాత్రకు ఒప్పుకున్నారని టాక్‌. ‘రాకెట్రీ’ సినిమాతో నటుడిగా, దర్శకుడిగా మాధవన్‌ ఇటీవల మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే.

వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల అనుకుని తొలుత సినిమాను వేగంగానే చిత్రీకరించారు. రాజమహేంద్రవరం, హైదరాబాద్‌లోని కొన్ని స్టూడియోల్లో సెట్స్‌ వేసి తీశారు. అయితే ‘ఆచార్య’ ప్రచారం తర్వాత సినిమా ఆలస్యమైంది. దీంతోపాటు శంకర్‌ కూడా కంగారు వద్దు అనుకున్నారట. అలా సినిమా షూటింగ్‌లో చిన్నపాటి బ్రేక్‌లు వచ్చాయి. దీంతో సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుని సమ్మర్‌ వార్‌లోకి వచ్చేసింది. అదీ శంకర్‌ దయతలిస్తేనే అనేది మరచిపోకూడదు.

ఇక ఈ సినిమాలో తారాగణం విషయంలో దిల్‌ రాజు – శంకర్‌ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదంటున్నారు. సినిమాలో కీలక పాత్ర కోసం రణ్‌బీర్‌ కపూర్‌ తల్లి నీతూ కపూర్‌ను సంప్రదించారని వార్తలొచ్చాయి. దీనిపై స్పష్టత లేకపోయినా నిజమే అని అంటున్నారు. హీరోయిన్‌గా కియారా అడ్వాణీ నటిస్తున్న విషయం తెలిసిందే. వీళ్లే కాకుండా మరికొన్నిప పాత్రలకు కూడా ముఖ్య నటుల్నే తీసుకున్నారట. సాంకేతిక నిపుణుల విషయంలోనూ ఈ భారీతనం చూడొచ్చు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus