Varanasi: నో చెప్పినోళ్లు అంతా ‘వారణాసి’లో చేరుతున్నారా? తాజాగా మరో ఆర్టిస్ట్‌!

మహేష్‌ బాబు – రాజమౌళి – ప్రియాంక చోప్రా – పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా అఫీషియల్‌ అనౌన్స్‌ కావడానికి ముందు, ఆన్అఫీషియల్‌గా అనౌన్స్‌ అయి.. మొన్నీమధ్య టైటిల్‌ ప్రకటన జరగడానికి ముందు మనకు కచ్చితంగా తెలిసిన సమాచారం అంటే మహేష్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకుడిగా కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న సినిమా ఇది. రీసెంట్‌ ఈవెంట్‌ తర్వాత ఆ సినిమా టీమ్‌ ఎవరు అనే క్లారిటీ వచ్చింది. రమ తనయుడు కార్తికేయ మరో నిర్మాత అని కూడా తేలింది.

Varanasi

అయితే, ఈ తేలిన విషయాల్లో చాలా విషయాలు గతంలో మీడియాకు ఏదో రూపంలో బయటకు వచ్చినవే. కావాలంటే మీరే చూడండి ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఈ సినిమాలో నటిస్తున్నారు అని చాలా నెలల క్రితమే లీకొచ్చింది. ఈ క్రమంలో వారిని అడిగితే ఏ విషయమూ క్లియర్‌గా చెప్పలేదు. ఆ మాటకొస్తే పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ అయితే నటించడం లేదు, నటిస్తానేమో, నటించే ఛాన్స్‌ ఉంది అనేలా కూడా మాట్లాడారు. ప్రియాంక చోప్రా అయితే చెప్పక చెప్పినట్లు హైదరాబాద్‌ వీధుల్లో తిరుగుతూ విషయం టీజ్‌ చేసింది.

ఇప్పుడు మరో వ్యక్తి ఇలా చెప్పకుండా, అడిగినా అటు ఇటు సమాచారం ఇచ్చిన వ్యక్తి సినిమాలో భాగమయ్యారు అని తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ నటుడు మాధవన్‌ను అడిగారు అని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఆయన నుండి ఎలాంటి స్పష్టత రాలేదు. టీమ్‌ కూడా స్పందించలేదు. అయితే ‘లేదు’ అని మాధవన్‌ అన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆయన కూడా సినిమాలో భాగమయ్యారని టాక్‌.

శ్రీరాముడు పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్నారని కూడా చెప్పేశారు. దీంతో మరి హనుమంతుడుగా ఎవరు నటిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. అది మాధవనే అని గత పుకార్ల ఆధారంగా పెద్ద లీకులు వస్తున్నాయి. మరి చూడాలి మాధవన్‌ కూడా ఈ సినిమాలో భాగమవుతాడేమో.

ఏంటీ.. భీమ్స్‌ సిసిరోలియో ఇన్ని సినిమాలు చేస్తున్నారా? లిస్ట్‌ తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus