భాషతో సంబంధం లేకుండా మాధవన్ కి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. అతను హీరోగా నటించిన సఖి, చెలి సినిమాలు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యాయి. అందుకే మాధవన్ తో స్ట్రైట్ తెలుగు మూవీ చేయాలనీ దర్శకనిర్మాతలు గతంలో ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే చందు మొండేటి అతనితో తెలుగులో స్ట్రైట్ మూవీ చేయగలిగారు. సవ్యసాచిలో నటింపచేయించారు. ఇందులో హీరోగా కాదు.. విలన్ గా మాధవన్ నటించడానికి ఒప్పుకోవడం విశేషం. నాగచైతన్య హీరోగా నటించిన మూవీ రేపు థియేటర్లోకి రానుంది. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. హీరో మాత్రమే కాకుండా విలన్ కూడా సినిమా విజయానికి దోహదం అవుతారని చెప్పుకుంటున్నారు. అయితే ఎవరికీ ఓకే చెప్పని మాధవన్ చందూ మొండేటి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది. ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. కథ, అందులో పాత్ర మాధవన్ ని టెంప్ట్ చేసినట్లు సమాచారం.
అందుకే ఒప్పుకున్నారంట. ఒప్పుకునేటప్పుడు ఒక కండిషన్ పెట్టారని టాక్. ‘‘సవ్యసాచి’ని తమిళంలో విడుదల చేయకూడదు’’ అని మాధవన్ చెప్పిన కండిషన్ కి దర్శకుడు, నిర్మాతలు సరేనని చెప్పడంతో అతను ఓకే చే చెప్పినట్లు ఫిలిం నగరవాసులు చెప్పారు. సాధారణంగా పరభాషా నటీనటులు తెలుగు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తే… ఆ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయడం ద్వారా నిర్మాతలకు కొంత లాభం వస్తుంది. అయినా ఆ లాభాన్ని నిర్మాతలు వదులుకున్నారు. ఎందుకంటే ‘సవ్యసాచి’ని తమిళంలో విడుదల చేస్తే, మాధవన్ హీరోగా చేసే సినిమాలపై, కెరీర్‌పై ఎఫెక్ట్ పడుతుందని భావించి దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.