Madhavan: ఆ సీన్ చూసి ఏడ్చేచేశారట.. ‘ధురంధర్’లో జరిగిన విషయం చెప్పిన మాధవన్
- February 23, 2026 / 01:58 PM ISTByFilmy Focus Desk
సినిమాల్లో విలన్ పాత్రలు, నెగిటివ్ పాత్రలు చేయమంటే చేసేస్తారు.. కానీ నిజ జీవితంలో అలాంటివారు చాలా సాఫ్ట్‌గా ఉంటారు అని అంటారు. బయట సాఫ్ట్‌గా ఉన్నా లేకపోయినా కొన్ని సీన్స్‌లో నటించిన తర్వాత ఆ నటులు చాలా ఇబ్బందిపడతారు. రీసెంట్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా ‘ధురంధర్’ సినిమా విషయంలోనూ ఇదే జరిగిందట. ఈ విషయాన్ని అందులో ఓ కీలక పాత్ర పోషించిన మాధవన్ చెప్పుకొచ్చారు.
Madhavan
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన సినిమా ‘ధురంధర్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా రూ.1400 కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. వసూళ్ల మాట అటుంచితే ఈ సినిమాలో పాకిస్థాన్ నేపథ్యంలో చూపించిన కొన్ని సన్నివేశాలకు మన ప్రేక్షకుల్లో రక్తం మరిగింది. అందులో ఒకటి ముంబయి టెర్రర్ అటాక్. ఆ సీన్స్‌లో నటులు అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నాపై తెరకెక్కించారు. ఆ సీన్స్ షూటింగ్ సమయంలో జరిగిన విషయాన్ని మాధవన్ చెప్పుకొచ్చారు.

కరాచీని అడ్డాగా చేసుకుని ఉగ్రవాద ముఠాల్ని పెంచి పోషిస్తున్న రెహమాన్ బలోచ్ అనే పాత్రలో అక్షయ్ ఖన్నా, పాకిస్థాన్ మేజర్ పాత్రలో అర్జున్ రాంపాల్ ఆ సినిమాలో నటించారు. వీరిద్దరూ కలసి ముంబయి టెర్రర్ అటాక్ చూస్తే ఆనందించే సీన్ గురించే మాధవన్ చెప్పారు. ముంబయి టెర్రర్ అటాక్ సీన్ షూట్ చేసిన తర్వాత ఆ ఇద్దరు నటులు ఏడ్చేశారట. అక్కడ భారతీయులు చనిపోతూ ఉంటే పాకిస్థానీలు లైవ్‌లో చూస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు ఆ సీన్‌లో. అందుకే కన్నీళ్లు వచ్చేశాయని మాధవన్ తెలిపారు.
ఆదిత్య ఆ సీన్‌కు కట్ చెప్పగానే అక్షయ్, అర్జున్ ఏడ్చేశారు. అలాంటి పాత్రలు పోషించడం కష్టమని, ఆ ప్రభావం వారిపై కొన్ని రోజుల పాటు ఉందని మాధవన్ తెలిపారు. ఇక ‘ధురంధర్’ పార్ట్ 2 ట్రైలర్ మార్చి 5న రానున్నట్లు సమాచారం. మార్చి 19న సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. మరి అనుకున్నట్లుగా అంతా జరిగి సినిమా వస్తే ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి.















