ఇన్వెస్టిగేటివ్ నవలలు.. ఈ మాట వినగానే టక్కున గుర్తొచ్చే పేరు ‘షాడో’. ప్రముఖ రచయిత మధుబాబు రాసిన ఈ నవలలకు పాఠకుల్లో ఎంతో ఆదరణ ఉంది. కొత్త నవల వస్తోంది అంటే చాలు.. సినిమా టికెట్ల కోసం పోటీ పడేలా అప్పుడు ఆ నవలలు చదివేవారు. అదొక వ్యసనం అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ నవలలు వెబ్ సిరీస్‌లు కాబోతున్నాయి. అవును మధుబాబు రాసిన సుమారు 146 నవలలను వెబ్ సిరీస్‌లుగా రూపొందించాలని నిర్ణయించుకున్నారట.
ఆ నవలలకు సంబంధించిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌ను దర్శకుడు శరత్ మండవ దక్కించుకున్నారు. ఈ మేరకు ఆయన టీమ్ వెల్లడించింది. వెబ్‌సిరీస్‌లో భాగంగా తెరకెక్కే తొలి సీజన్‌లోని ఎపిసోడ్లను ప్రముఖ దర్శకులు పని చేస్తారని టాక్ వినిపిస్తోంది. తెలుగు నుండే కాక, తమిళం, మలయాళం నుండి దర్శకులను ఈ వెబ్‌సిరీస్‌లో భాగస్వాములను చేయాలని అనుకుంటున్నారట. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారట.
ఇక మధుబాబు నవలల సంగతి చూస్తే.. 1970-90 మధ్యకాలంలో పరిశోధనాత్మక నవల విభాగంలో తనదైన ముద్ర వేశారాయన. ‘ఏ జర్నీ టు హెల్’, ‘బ్లడీ బోర్డర్’, ‘గోల్డన్ రోబ్’, ‘నైట్ వాకర్’, ‘రెడ్ షాడో’, ‘రన్ షాడో రన్’, ‘సీఐడీ షాడో’, ‘డర్టీ డెవిల్’, ‘డాక్టర్ షాడో’, ‘ఏ బుల్లెట్ ఫర్ షాడో’, ‘ఏ డెవిల్ ఏ స్పై’, ‘ఏంజెల్ ఆఫ్ డెత్’, ‘ఫ్లయింగ్ బాంబ్’ తదితర షాడో నవలలు అప్పుడు వచ్చాయి. దీంతోపాటు ఆయన కొన్ని ఫాంటసీ నవలలు కూడా రాశారు.
శరత్ మండవ అంటే.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా దర్శకుడు. సినిమాటోగ్రాఫర్ కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. కొన్ని పురస్కారాలు కూడా అందుకున్నారు. ఇప్పుడు నవలల హక్కులు తీసుకొని నిర్మాతగా మారుతున్నారు. అయితే ఇక్కడ ఒకటే డౌట్.. ఆ నవలలలో చాలా సీన్స్, కాన్సెప్ట్స్ ఇప్పటికే చాలా సినిమాల్లో మన దర్శకులు వాడేసుకున్నారు. ఇప్పుడు వాటిని మళ్లీ చూస్తారా? అనేది. అయితే మధుబాబు నవలల మ్యాజిక్ చదివిన వాళ్లకే బాగా తెలుసు.
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!