Madhuri Dixit: సంచలనం సృష్టించిన మాధురి దీక్షిత్ కాస్ట్ లీ లిప్ లాక్..!

బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో ఎన్నో అద్భుతమైన ప్రేమ కథా చిత్రాల్లో నటించి కుర్రకారుని తన గుప్పిట్లో పెట్టుకునేది. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి… స్టార్ హీరోయిన్ గా ఎదిగింది మాధురి. అప్పట్లో ఈమె కాల్ షీట్లు దొరకడం కూడా చాలా కష్టంగా మారేది అని దర్శక నిర్మాతలు ఇప్పటికీ చెబుతుంటారు.

అయితే ఓ స్టార్ హీరోతో ఈమె ప్రేమలో పడటం.. తర్వాత బ్రేకప్ అవ్వడంతో ఈమె డిప్రెషన్ కు గురైనట్టు వార్తలు వినిపించేవి. ఆ స్టార్ హీరో సంజయ్ దత్ చాలా మందికి తెలిసిన సంగతే..! తర్వాత వీళ్ళు మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడంటే లిప్ లాక్ సన్నివేశాలను జనాలు అంత భూతద్దంలో పెట్టుకుని చూడటం లేదు. ఇవి మామూలే కదా అని అనుకుంటున్నారు. అయితే అప్పట్లో ఇది చాలా పెద్ద విషయం.

ఫిరోజ్ ఖాన్ దర్శకత్వంలో ‘దయావన్’ అనే చిత్రంలో నటించింది మాధురి దీక్షిత్. 1988 లో వచ్చిన ఈ సినిమాలో వినోద్ ఖన్నా- మాధురి దీక్షిత్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో వీరి మధ్య ఓ ఇంటిమేట్ సీన్ తో పాటు డీప్ లిప్ లాక్ కూడా ఉంటుంది. దీని గురించి అప్పట్లో చాలా ట్రోలింగ్ ఎదుర్కొంది మాధురి. మొదట ఆమె ఒప్పుకోలేదట కానీ దర్శకనిర్మాతలు కోటి రూపాయలు ఆఫర్ చేయడంతో చేసేసింది.

దాని వల్ల ఈమె తన అభిమానుల చేతిలో కూడా ట్రోల్ అయ్యింది.35 ఏళ్ళ క్రితం నాటి ఈ సంగతిని ఇటీవల మరోసారి తలుచుకుని ‘నేను ఆ సన్నివేశంలో నటించి ఉండకూడదు’ అంటూ బాధపడింది మాధురి దీక్షిత్.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus