Rajinikanth: రజనీకాంత్ కు గుడి కట్టి అభిమానం చాటుకున్న ఫ్యాన్.. వీడియో వైరల్!

సాధారణంగా సినీ సెలెబ్రెటీలకు అభిమానులు ఉంటారనే విషయం మనకు తెలిసిందే. ఇలా తమ అభిమాన హీరో హీరోయిన్ల కోసం సెలబ్రిటీలు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు. వారి సినిమాలు విడుదలవుతున్న లేదా పుట్టినరోజులు వంటివి వస్తున్న పెద్ద ఎత్తున సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలకు అభిమానులు గుడి కట్టించి వారి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నారు.. ఈ విధంగా ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లకు సంబంధించి గుడి కట్టి వారిని అభిమానులు ఆరాధిస్తూ ఉన్నారు.

అయితే మొదటిసారి ఒక హీరోకి కూడా గుడి కట్టి ఆ హీరో పట్ల వారికి ఉన్నటువంటి అభిమానాన్ని బయటపెట్టారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రజనీకాంత్ కు ఎలాంటి అభిమానం ఉందో మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు అయితే రజనీకాంత్ అంటే ఎంతో అభిమానం ఉన్నటువంటి కార్తీక్ అనే ఫ్యాన్ ఏకంగా రజనీకాంత్ కు గుడి కట్టించారు.

మధురైకి చెందిన కార్తీక్ అనే రజనీకాంత్ వీరాభిమాని ఆయన కోసం గుడి కట్టాడు. ఆ గుడిలో 250 కిలోల రజనీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేసాడు. విగ్రహం క్రింద తన తల్లిదండ్రుల ఫోటో, గణేశుని ఫోటో ఉంచాడు. ఇలా రజనీకాంత్ కోసం ప్రత్యేకంగా గుడి కట్టించడమే కాకుండా నిత్యం పూజలు నైవేద్యాలను సమర్పిస్తూ నిజంగానే రజినీకాంత్ ను ఒక దేవుడిగా భావించి పోజిస్తున్నారు.

ఈ విధంగా కార్తీక్ (Rajinikanth) రజనీకాంత్ ను దేవుడితో పోలుస్తూ ఆయన తన భక్తుడిగా భావించి తరచూ పూజలు చేస్తూ ప్రసాదాలను సమర్పిస్తూ పెద్ద ఎత్తున రజనీకాంత్ ను అభిమానిస్తున్నారు అయితే ఇలా రజినీకాంత్ కి ఈ స్థాయిలో అభిమానులు ఉన్నారు అనే విషయం రజనీకాంత్ వరకు చేరిందో లేదో తెలియదు కానీ ప్రస్తుత ఎందుకు సంబంధించినటువంటి వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఈ వీడియో పై ఎంతో మంది వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus