చిరుత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ప్రయాణం మొదలుపెట్టిన రామ్ చరణ్ రెండో సినిమా మగధీరతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన పలు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించగా రంగస్థలం సినిమా నటుడిగా చరణ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. గతేడాది, ఈ ఏడాది చరణ్ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అయితే వచ్చే ఏడాది కేవలం నాలుగు వారాల గ్యాప్ లో చరణ్ నటించిన రెండు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.
ఆర్ఆర్ఆర్ మూవీ 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన రిలీజ్ కానుండగా ఆచార్య సినిమా ఫిబ్రవరి 4వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం. ఈ రెండు సినిమాలు పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు కాగా చరణ్ సెంటిమెంట్ ప్రకారం ఈ రెండు సినిమాలు హిట్టేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ 1920 కాలం నాటి ఫిక్షన్ గా తెరకెక్కగా ఆచార్య 30ఏళ్ల కాలం నాటి కథాంశంతో తెరకెక్కిందని బోగట్టా.
రామ్ చరణ్ గతంలో నటించి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలైన మగధీర, రంగస్థలం సినిమాలు సక్సెఫ్ ఫుల్ గా నిలిచాయి. ఈ సెంటిమెంట్ తో చరణ్ భవిష్యత్తు సినిమాల ఫలితాల విషయంలో ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాలు అభిమానుల అంచనాలను మించి విజయం సాధిస్తాయేమో చూడాల్సి ఉంది. చరణ్ నటించిన సినిమాలు తక్కువ గ్యాప్ లో రిలీజ్ కానుండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ కు స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించగా ఆచార్యకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. అపజయం ఎరుగని దర్శకుల డైరెక్షన్ లో చరణ్ నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు చరణ్ ఏకంగా 45 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రకు చరణ్ పూర్తిస్థాయిలో న్యాయం చేశారని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ద్వారా నెటిజన్లు కన్ఫామ్ చేస్తున్నారు.