క్లాస్, మాస్ అన్న బేధం లేదు.. దేవిశ్రీప్రసాద్ సంగీతం అంటే అందరూ ఎంజాయ్ చేయదగ్గది అని ఫిక్స్ అయిపోయారు జనాలు. “సొంతం, వెంకీ, ఆర్య, సన్నాఫ్ సత్యమూర్తి” లాంటి సినిమాలకు దేవి స్వరపరిచిన గీతాలు ఇప్పటికీ చాలామందికి ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్. అలాంటి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ లో ఇదివరకు వినిపించిన మ్యాజిక్ ఇప్పుడు మిస్ అవుతోంది. ఇటీవల “రంగస్థలం, భరత్ అనే నేను” లాంటి డీసెంట్ హిట్స్ కొట్టిన దేవిశ్రీప్రసాద్ ఇప్పుడు “వినయ విధేయ రామ” చిత్రానికి వర్క్ చేస్తున్నాడు. ఇప్పటివరకూ ఈ చిత్రంలోని రెండు పాటలు విడుదలయ్యాయి. ఈ రెండు సాంగ్స్ లో ఏ ఒక్క పాటలోను దేవిశ్రీప్రసాద్ మ్యాజిక్ కనిపించలేదు. దాంతో దేవి అభిమానులు మాత్రమే కాక మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా ‘దేవికి ఏమైంది?” అనుకొంటున్నారు.
ఈ ఆల్బమ్ లో ఇంకో నాలుగు పాటలున్నాయి. ఆ సాంగ్స్ కూడా ఇదే తరహాలో ఉన్నాయంటే.. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫెయిల్ అయినట్లే లెక్క. బోయపాటి ఎదో ఒకటి చేసి బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలాగూ పితుక్కుంటాడు కాబట్టి పర్లేదు కానీ.. ఇదే ఫార్మాట్ లో కంటిన్యూ అయితే మాత్రం దేవి తన ఉనికిని నిలుపుకోవడం కష్టమే. ఒకపక్క తమన్, గోపీసుందర్ లాంటివాళ్లు వరుస హిట్స్ తో దూసుకుపోతుంటే.. దేవి ఇలా చతికిలపడడం అతడి అభిమానులకు బ్యాడ్ న్యూసే.