తెలుగు సినిమాలకు థ్రియేట్రికల్ రైట్స్ తో పాటు శాటిలైట్ రైట్స్ కూడా భారీగానే పలుకుతున్నాయి. స్టార్ హీరోలు నటించిన సినిమాలు పదికోట్లకు పైనే తెలుగు శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోతున్నాయి. సినిమా పూర్తికాకముందే అగ్రిమెంట్స్ పూర్తివతున్నాయి. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా హీరో, డైరక్టర్, బ్యానర్ , అంచనాలను బట్టి ఈ కార్యక్రమాలు పూర్తి అవుతున్నాయి. అయితే మహానటి విషయంలో ఈ బిజినెస్ జరగలేదు. కారణం.. ఇది కమర్షియల్ సినిమా కాదు. స్టార్ హీరో లేడు. భారీ ఫైట్స్.. ఐటెం సాంగ్స్ అసలే ఉండవు. సావిత్రి కథ అన్న ఇంట్రెస్టింగ్ సంగతి తప్ప.. మరేది ఆకర్షించే అంశం లేదు. సో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కొనడానికి తెలుగు ఛానల్స్ పోటీపడలేదు.
జీ తెలుగు, జెమిని ఛానెల్స్ ముందుకు వచ్చాయి కానీ.. కనీస ధర కంటే తక్కువ కోరడంతో నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ లు ఇవ్వడానికి ఆసక్తిచూపించలేదు. ధైర్యం చేసి సినిమా రిలీజ్ తర్వాతే అమ్మడానికి సిద్ధమయ్యారు. వారి దైర్యం లక్ష్మి దేవిని అందించింది. నేడు రిలీజ్ అయిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. కీర్తి సురేష్ సావిత్రిగా మెప్పించింది. అన్ని ఏరియాల నుంచి మంచి కలక్షన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహానటి శాటిలైట్ హక్కుల్ని భారీ ధరకు ఛానెల్స్ సొంతం చేసుకోవడానికి పోటీపడుతున్నాయి. మరి ఏ ఛానల్ మహానటి దక్కించుకుంటాయో చూడాలి.