‘కధానాయకుడు’ ని మించి డిజాస్టర్ అయ్యేలా ఉంది…!

నందమూరి బాలకృష్ణ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎంత కాదనుకున్నా పాజిటివ్ టాక్ వస్తే మినిమం 25 కోట్లయినా కలెక్షన్లు వస్తాయి. గత సంక్రాంతికి విడుదలైన ‘జై సింహా’ చిత్రానికి పెద్ద హిట్ టాక్ ఏమీ రాలేదు. అయినప్పటికీ 28 కోట్ల వరకూ కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ సంవత్సరం విడుదలైన ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రం హిట్ టాక్ సంపాదించుకుని కూడా 20 కోట్లు వరకే ఆగిపోయింది. పోనీ సంక్రాంతికి సినిమాల పోటీ ఉంది. ఇక ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రం కచ్చితంగా మంచి కలెక్షన్లను రాబడుతుంది… అని భావించిన వారందరికీ షాక్ తగిలింది. ఫిబ్రవరి 22 న (నిన్న) విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్లు 2 కోట్లు కూడా రాబట్టకపోవడం గమనార్హం.

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రానికి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ తో అయినా కోలుకుంటారని భావించిన వారికి… మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్ర కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజామ్: 0.36 cr
సీడెడ్: 0.18 cr
ఉత్తరాంధ్ర: 0.14 cr


కృష్ణా: 0.15 cr
గుంటూరు: 0.51 cr
ఈస్ట్ : 0.09 cr


వెస్ట్: 0.10 cr
నెల్లూరు: 0.06 cr


——————————————————–
ఎపీ + తెలంగాణా
టోటల్ కలెక్షన్స్ 1.59 cr
———————————————————

క్రిష్ డైరెక్షన్, బాలయ్య బాబు(ఎన్టీఆర్ ) హీరో… రానా ముఖ్యపాత్రలో చేయడం, బసవతారకం గా విద్యాబాలన్…. హరికృష్ణ గా కళ్యాణ్ రామ్, నాగేశ్వర రావు గా సుమంత్… ఈ మాత్రం సరిపోదా ‘ఎన్టీఆర్’ బయోపిక్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి… కనీసం 50 కోట్లు కలెక్ట్ చేయడానికి..? మరి లోపం ఎక్కడ జరిగింది..? ఇవే ప్రేక్షకుల్లోనూ… నందమూరి అభిమానుల్లోనూ కలుగుతున్న సందేహాలు. మరి ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus