“మ‌హ‌నుభావుడు” ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి ముహూర్తం ఖరారు!

శ‌ర్వానంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గా, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్ర‌మొద్ లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం మ‌హ‌నుభావుడు చిత్రం ఇటీవ‌లే సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యుఏ సర్టిఫికేట్ తో విజ‌యద‌శ‌మి కానుక‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 29న‌ విడుద‌ల‌వుతుంది. ఇట‌లీ, ఆస్ట్రియా, క్రోయెషియా లాంటి విదేశాల్లో మ‌రియు పోలాచ్చి, రామోజీ ఫిల్మ్‌సిటి, హైద‌రాబాద్ లో ని అంద‌మైన లోకేష‌న్స్ లో ఈ చిత్ర షూటింగ్ జ‌రుపుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ని సెప్టెంబ‌ర్ 24న గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు. ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ అందించిన ఆడియో చార్ట్ బ‌స్ట‌ర్ లో నెంబ‌ర్ 1 గా వుండ‌టం విశేషం.. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. మా బ్యాన‌ర్ లో వ‌స్తున్న మ‌హ‌నుభావుడు చిత్రం సెన్సారు కార్క‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. సెప్టెంబ‌ర్ 29 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్బంగా విడుద‌ల చేస్తున్నాము. ప‌క్కా ఫ్యామిలి ఎంట‌ర్ టైన‌ర్ గా రూపోందిన ఈ చిత్రానికి ఇంటిల్ల‌పాది ఆనందించేలా ద‌ర్శ‌కుడు మారుతి తెర‌కెక్కించాడు. హీరో శ‌ర్వానంద్ ఓసిడి పాత్ర‌లో ఓదిగిపోయి న‌టించాడు. అతిప‌రిశుభ్ర‌త అనే కాన్సెప్ట్ తో మారుతి చేయించిన కామెడి చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. మెహ‌రిన్ చాలా అందంగా నటించింది. థ‌మ‌న్ అందించిన ఆడియో ఇప్ప‌టికే మంచి విజ‌యం సాధించింది. సెప్టెంబ‌ర్ 24న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చేస్తున్నాము. అని అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus