‘మహావతార్ నరసింహ’ భారతీయ చలన చిత్ర రంగ చరిత్రలో యానిమేషన్ మూవీలలో ఒక సంచలనం అని చెప్పటం అతిశయోక్తి ఏమి కాదు, ఎందుకంటే చిన్న బడ్జెట్ తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో రికార్డు లు సృష్టించింది ఈ చిత్రం. అంతటితో ఆగిపోకుండా వరల్డ్ లోనే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ బరిలో నిలిచింది. ఈ మూవీ యానిమేషన్ విభాగంలో ఆస్కార్ బరిలో నిలవటం నిజంగా భారతీయ చలన చిత్రానికి గర్వకారణంగా చెప్పుకోవచ్చు .
ఈ యానిమేషన్ మూవీ ‘మహావతార్ నరసింహ’ ను ఇటీవల పాకిస్థాన్లో ప్రదర్శించారు. కరాచీలోని చారిత్రక నారాయణ స్వామి దేవాలయంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా వందల సంఖ్యలో పాకిస్థానీ హిందువులు తరలివచ్చి మూవీని చూడటం జరిగింది. వారంతా సినిమాను వీక్షిస్తూ భక్తి పరవశంలో మునిగిపోయారు. పాకిస్థాన్లో హిందూ సంస్కృతి సాంప్రదాయానికి , భక్తికి ఇది నిదర్శనంగా నిలువటంతో దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ వైరలవుతోంది.
ఈ చిత్రానికి అశ్విని కుమార్ దర్శకత్వం వహించగా, జయపూర్ణ దాస్ రచయితగా వ్యవహరించాడు. కన్నడలో సంచలన చిత్రాలను నిర్మిస్తున్న హోంబేలె ఫిలిమ్స్ మరియు క్లిమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా మహావతార్ నరసింహ మూవీని నిర్మించారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. సామ్ సి ఎస్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి వెన్నెముకగా నిలిచింది. మహావతార్ నరసింహ చిత్రం ఆస్కార్ గెలిచినట్లయితే ఇండియన్ సినిమా యానిమేషన్ రంగంలో కొత్త పుంతలు తొక్కటం గ్యారెంటీ.