తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మహావీరుడు’. జూలై 14 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ బాగుంది. డిఫరెంట్ గా కూడా ఉందనే భావన అందరిలోనూ కలిగింది. మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేసిన ఫాంటసీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇది. అదితి శంకర్ హీరోయిన్ గా నటించింది. ‘శాంతి టాకీస్’ పతాకంపై అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మించగా….
టాలీవుడ్ లీడింగ్ బ్యానర్స్ లో ఒకటైన ‘ఏషియన్ సినిమాస్’ ఈ చిత్రం తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేయడం జరిగింది. మొదటి రోజు మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యాయి.ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడింది. అలాగే ఫస్ట్ డే డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టింది ఈ సినిమా. రెండో రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసింది. ఒకసారి రెండు రోజుల కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.32 cr |
సీడెడ్ | 0.17 cr |
ఆంధ్ర | 0.25 cr |
ఏపి + తెలంగాణా | 0.74 cr |
‘మహావీరుడు’ (Mahaveerudu) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రానికి కేవలం రూ.0.74 కోట్ల షేర్ నమోదైంది. మొదటి రోజు కంటే రెండో రోజు ఈ మూవీ ఎక్కువ కలెక్ట్ చేసింది.
అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ కి రూ.4.26 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ ఎఫెక్ట్ తో సండే బుకింగ్స్ కూడా బాగున్నాయి. మరి ఇలాగే స్టడీగా కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధిస్తుందేమో చూడాలి.
హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!