‘సైరా’ కి చెక్ పెట్టనున్న మహేష్.. చిరుకి కాస్త ఇబ్బందే..!

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా ‘సైరా నరసింహ రెడ్డి’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై మెగాపవర్ స్టార్ రాంచరణ్ నిర్మిస్తున్నాడు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మొదట దసరా కానుకగా విడుదల చేయాలని భావించినప్పటికీ ఇప్పుడు అది వీలయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. చాలా గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది. అలాగే ప్యాచ్ వర్క్ కూడా ఉంటుంది. ఈ చిత్రం బిజినెస్ రికవరీ అవ్వాలంటే ఫెస్టివల్ సీజన్లోనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. చిరు, చరణ్ లు కూడా ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట.

అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రాన్ని కూడా సంక్రాంతికే విడుదల చేయాలని ఈ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం షూటింగ్ ఇంకా మొదలు కాలేనప్పటికీ… 6 నెలల్లో పూర్తి చేసేస్తానని అనిల్ రావిపూడి చెప్పాడని తెలుస్తుంది. ఈ చిత్ర నిర్మాతలు దిల్ రాజు ,అనిల్ సుంకర కూడా అదే ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతి సీజన్ వదులుకోవడానికి దిల్ రాజు అస్సలు ఒప్పుకోడు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘ఎవడు’ ‘శతమానం భవతి’ ‘ఎఫ్2’ ఇవన్నీ సంక్రాంతి కానుకగా విడుదలయ్యి కాసుల వర్షం కురిపించాయి. సో దిల్ రాజు కంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఈ క్రమంలో భారీ పోటీ తప్పేలా లేదు. అయితే సంక్రాంతి సీజన్లో రెండు, మూడు పెద్ద సినిమాలు విడుదలైనా పర్వాలేదు. కానీ ‘సైరా’ లాంటి భారీ బడ్జెట్ చిత్రానికి ఇది కొంచెం కష్టమనే చెప్పాలి. అందులోనూ అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్ అంటే కచ్చితంగా అది మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమానే అవుతుంది. ఎంత మెగాస్టార్ సినిమా అయినా… భారీ బడ్జెట్ సినిమా అయినా… కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమానే సంక్రాంతికి కావాలి. ఈ క్రమంలో ‘సైరా’ చిత్రానికే పెద్ద ఇబ్బంది చెప్పాలి. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus