గద్దలకొండ గణేష్ ని బాగా ఎంజాయ్ చేశా : సూపర్ స్టార్ మహేష్

  • September 24, 2019 / 07:32 PM IST

’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై అనిల్ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 20 న విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళంలో సూపర్ హిట్టైన ‘జిగర్తాండ’ చిత్రానికి ఇది రీమేక్ కావడం విశేషం. వరుణ్ తేజ్ మాస్ అవతార్ కు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.

3 రోజుల్లోనే బయ్యర్లకి 75 % రికవరీ రాబట్టి బ్లాక్ బస్టర్ గా దూసుకెళ్తున్న ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ చూశారు. ‘గద్దలకొండ గణేష్’ చూస్తూ బాగా ఎంజాయ్ చేశానని. వరుణ్ తేజ్ గణేష్ గా అద్భుతంగా నటించాడని. హరీష్ శంకర్, 14 రీల్స్ సినిమాని చాలా బాగా తెరకెక్కించారని, అలాగే మంచి సక్సెస్ ను అందుకున్న చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ కి హీరో వరుణ్ తేజ్, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు రామ్ , గోపి థాంక్స్ చెప్పారు.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus